పరీక్షలంటే ప్రతి విద్యార్థికి భయమే. పరీక్షలకు భయపడి చాలా మంది పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారు. పరీక్షలు లేని చదువులు కావాలని చాలా సార్లు అనుకుంటారు. పరీక్షలు విద్యకు, ప్రతిభకు కొలమానం కాబట్టి..వాటిని నిర్వహించాల్సిందే, రాయాల్సిందే. దీంతో బాగా చదివే విద్యార్థులు..
పరీక్షలంటే ప్రతి విద్యార్థికి భయమే. పరీక్షలకు భయపడి చాలా మంది పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారు. పరీక్షలు లేని చదువులు కావాలని చాలా సార్లు అనుకుంటారు. పరీక్షలు విద్యకు, ప్రతిభకు కొలమానం కాబట్టి..వాటిని నిర్వహించాల్సిందే, రాయాల్సిందే. దీంతో బాగా చదివే విద్యార్థులు, తెలివైన విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో కాపీ కొడతారు. చిట్టీల రూపంలో తయారు చేసుకుని, ఇన్విజిలేటర్ చూడని సమయంలో బయటకు తీసి బరా బరా రాసేస్తుంటారు. ఇక దొరికామా డిబారే. దొరికితే డిబార్ చేస్తారని తెలిసి కూడా కొంత మంది ఈ ప్రయత్నాలను మానడం లేదు. తాజాగా ఓ విద్యార్థిని దొరికిపోగా.. కాలేజీ యాజమాన్యం ఏం చేసిందంటే..?
పరీక్షల్లో కాపీయింగ్ చేసిందంటూ ఓ విద్యార్థినిని లెక్చరర్ దారుణంగా కొట్టిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చిక్కమగళూరు నగరంలోని ఏఐటీ సర్కిల్‌లోని ఓ ప్రైవేట్ పారామెడికల్ కళాశాలలో బిందు అనే యువతి మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే ఇటీవల కాలేజీలో పరీక్షలు నిర్వహించగా.. కాపీ చేసిందంటూ ఆమెపై లెక్చరర్ తీవ్రంగా దాడి చేశారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బిందు చెబుతున్న దాని ప్రకారం.. ‘పరీక్షలు రాస్తున్న సమయంలో నాపై గట్టిగా అరవడంతో..నాకు తలనొప్పి వచ్చి.. స్పృహ తప్పి పడిపోయాను. వెంటనే నటిస్తోందని అంటూ లెక్చరర్లు.. నా స్నేహితులు సాయం చేసేందుకు అంగీకరించలేదు. ఒక గంట తర్వాత హెల్త్ రూముకు తీసుకు వెళ్లి.. తీవ్రంగా లెక్చరర్ కొట్టాడు. తలపై, చెంపపై తన్నాడు. బిందు నాపై మూడు బకెట్ల నీళ్లు పోశారు’అంటూ ఆవేదన చెందింది.
ప్రస్తుతం బిందు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా, బిందు ఆరోపణలను కాలేజీ యాజమాన్యం తోసిపుచ్చింది. ‘ఆమె పరీక్షల్లో కాపీ చేస్తూ పట్టుబడింది. తిట్టగానే కింద పడిపోయినట్లు నటించింది. ఆమెను లేపేందుకు లెక్చరర్ ప్రయత్నించారు. కేవలం ఆమెను నిద్ర లేపడానికి నీళ్లు చిలకరించారు. ఆమె మీద బకెట్ నీళ్లు పోశామని, కొట్టామని చెప్పడం అంతా అబద్ధం. హైస్కూల్ పిల్లలు తప్పు చేస్తే కొట్టవచ్చు. కానీ, కాలేజీ పిల్లలను కూడా ఎవరైనా కొడతారా. మేము బిందును కొట్టలేదు. ఆమె అబద్ధాలు చెబుతుంది’ అంటూ స్కూల్ మేనేజ్‌మెంట్ బోర్డు హెడ్ నళిని సమాజిషి అన్నారు.