టెక్నికల్ ఎడ్యూకేషన్ అయిన ఇంజనీరింగ్‌లో రామాయణం, మహాభారతం, రామ చరితం లాంటి పురాణాలు, ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నట్లు మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై మాట్లాడిన ఎంపీ, మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ ఇందులో ఎలాంటి తప్పు లేదన్నారు. “రాముని పాత్ర, సమకాలీన రచనల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇంజనీరింగ్ కోర్సుల్లో నేర్చుకోవచ్చు” అని అన్నారు. నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ 2020 పరిధిలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మా స్టడీ బోర్డ ఉపాధ్యాయులు ఎన్‌సీపీ 2020 కింద సిలబస్‌ను సిద్ధం చేశారు. మన అద్భుతమైన చరిత్రను వెలుగులోకి తీసుకురావడంలో ఎవరికీ ఎలాంటి సమస్య ఉండకూడదు అని ఉన్నత విద్యా మంత్రి చెప్పారు.