అన్న చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో చెప్పలేం. ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరుడు, సోదరుడిని విడిచి సోదరి ఉండలేరు. ఆటలాడేందుకు మొబైల్ కోసం టీవీ చూసేందుకు రిమోట్ కోసం పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది. రాఖీ పౌర్ణమి నేపథ్యంలో ‘వాట్సాప్’ కొత్త స్టిక్కర్స్ తీసుకొచ్చింది. ఈ మెసేజింగ్ యాప్ లేకుండా ప్రతీ రోజు కొందరికి జీవనం ఉండబోదని అనేలా యూజ్ చేస్తున్నారు. ఇకపోతే ‘రక్షా బంధన్’ వంటి ప్రాముఖ్యత కలిగిన పండుగ నేపథ్యంలో స్టిక్కర్స్ తీసుకురావడం పట్ల యూజర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. రాఖీ వేడులను మరింత రెట్టింపు చేసేందుకు కొత్తగా స్టిక్కర్లు, జిఫ్‌లను ప్రవేశపెట్టింది.
వీడియో కాల్స్, మెసేజెస్ కంటే ఈ రాఖీ స్టిక్కర్ల ద్వారా శుభాకాంక్షలు చెప్పడం వినూత్న అనుభవాన్ని ఇస్తుందని చెబుతోంది. ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి, రక్షా బంధన్ వాట్సాప్ స్టిక్కర్లను సెర్చ్ చేయండి. అనేక స్టిక్కర్ యాప్‌లు కనిపిస్తాయి. నచ్చిన స్టిక్కర్లు లేదా జిఫ్‌లు ఉన్న యాప్‌ను ‘ఇన్స్టాల్’ చేసుకోండి.
ఫోన్లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, దాన్ని ఓపెన్ చేయండి. యాప్‌లో మీకు నచ్చిన రాఖీ స్టిక్కర్ ప్యాక్‌లను ఎంచుకోండి. ఆ తర్వాత ‘యాడ్ టు వాట్సాప్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. స్టిక్కర్ ప్యాక్ ను వాట్సాప్‌లో ఉపయోగించుకోవచ్చు. ఇక ఆ తర్వాత యాడ్ టు వాట్సాప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు. వెంటనే స్టిక్కర్ ప్యాక్ వాట్సాప్‌లో యాడ్ అయిపోతుంది. ఎమోజీ సింబల్స్‌పై క్లిక్ చేసి కావాల్సిన వారికి స్టిక్కర్స్‌ను పంపించుకోవచ్చు.