ప్రస్తుతం ఎన్ని కోట్లు ఖర్చు చేసి సినిమా తీశాం అనేది ముఖ్యం కాదు.. ఎంత బాగా ప్రమోషన్ చేశాం అనేదే ముఖ్యం. సోషల్ మీడియా వినియోగం పెరిగిన ప్రస్తుత కాలంలో.. సినిమా ప్రమోషన్ చేసే విధానం కూడా మారింది. ఇక సినిమాల ప్రచారం విషయంలో సోషల్ మీడియా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. దానిలో భాగంగానే సినిమా ప్రచారంలో ప్రచారంలో ట్విట్టర్ పాత్ర ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ట్రోలింగ్ జరగాలన్నా, ప్రచారం జరగాలన్నా, ఉన్నది లేనట్లు భ్రమించేలా చేయాలన్నా ట్విట్టర్‌కే సాధ్యం. ట్విట్టర్ ప్రచారంలో పర్సనలైజ్డ్ ఎమోజీ ఒకటి. సినిమాకి సంబంధించి హ్యాష్‌ట్యాగ్‌ను టైప్ చేసినప్పుడు పక్కన ఆ హీరో బొమ్మ, లోగో, ఐకాన్ ఇలా ఏదో ఒకటి యాడ్ చేస్తుంటారు. ‘సర్కారు వారి పాట’ సినిమాకు తాజాగా ఈ అవకాశం దక్కింది. అంతేకాక ట్విట్టర్ ఎమోజీని దక్కించకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. అయితే ఇక్కడో విషయం సిని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇది కూడా చదవండి: Keerthy Suresh: కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. కాస్ట్యూమ్స్ కొట్టేసిన దొంగలు!
ఇటీవల కాలంలో సౌత్ నుండి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు ‘ఆర్ఆర్‌ఆర్’, ‘కేజీయఫ్ 2’కి ట్విటర్‌లో ప్రచారం భారీగానే సాగింది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు సంబంధించి ఎన్ని రకాల ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేసి రాజమౌళి టీమ్ అదరగొట్టింది. కానీ పర్సనల్ ఎమోజీ తీసుకురాలేకపోయారు. కానీ ‘సర్కారు వారి పాట’ టీమ్ ఆ పని చేసింది. అంతేకాక త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన KGF 2కి కూడా పర్సనల్ ఎమోజీ వచ్చింది. ఇక ఇటీవల కాలంలో సౌత్ నుండి వచ్చిన సినిమాల్లో ఇలా ట్విటర్ ఎమోజీ తీసుకొచ్చిన సినిమా అంటే ‘బీస్ట్’ అనే చెప్పాలి. #Beast అని ట్విట్టర్‌లో టైప్ చేయగానే పక్కన విజయ్ ఫేస్ వచ్చేది. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’కు కూడా ఇలా పర్సనలైజ్డ్ ఎమోజీ తీసుకొచ్చారు. అందులోనూ ఒక హ్యాష్‌ట్యాగ్ కాదు, మూడు హ్యాష్ ట్యాగ్‌లు సిద్ధం చేశారు. వాటిని మహేష్ ఇటీవల ట్వీట్ చేసి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు.
Just trying out this new emoji 😉#SarkaruVaariPaata#SVP#SVPMania
— Mahesh Babu (@urstrulyMahesh) May 5, 2022
ఇది కూడా చదవండి: సర్కారు వారి ట్రైలరా మజాకా.. 24 గంటల్లో అన్ని రికార్డులు చెరిపేసిన రిపోర్టర్ మహేష్!
ఇక ఇప్పటికే సర్కారు వారి పాట చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. దర్శకుడు పరశురామ్, హీరోయిన్ కీర్తి సురేష్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే మహేష్ బాబు కూడా వీరితో కలవనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్.. హైదరాబాద్ వచ్చాడు. మే 7 యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖుల మధ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇక సర్కారు వారి పాట సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Karate Kalyani: విశ్వక్ సేన్ vs దేవి నాగవల్లి వివాదం.. అనసూయని లాగిన కరాటే కళ్యాణి!