వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ మెసేజింగ్ యాప్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్, ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కొన్ని సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ యూజర్లను సర్ ప్రైజ్ చేయనుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యమైన సోషల్ మెసేజింగ్ యాప్ ఏది అంటే.. అందరూ టక్కున వాట్సాప్ అనే చెబుతారు. ఎందుకంటే సాధారణంగా వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే కాకుండా ఇప్పుడు బిజినెస్, కంపెనీల అవసరాల కోసం కూడా వాట్సాప్ నే వాడుతున్నారు. మెసేజ్ లు, ఆడియో- వీడియో కాల్స్ మాత్రమే కాకుండా.. గ్రూప్ మీటింగ్స్, షెడ్యూల్డ్ గ్రూప్ కాల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ తమ వినియోగదారులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా కొన్ని న్యూ ఫీచర్స్ ని తీసుకురానున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
వాట్సాప్ కనీసం నెలకు ఒక అప్ డేట్ అయినా తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్, ఏవోఎస్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఫీచర్స్, అప్ డేట్స్ తీసుకొస్తున్నారు. ఇటీవలే వాట్సాప్ లో స్టేటస్ పెడితే ఆటోమేటిక్ గా ఫేస్ బుక్ లోకి వచ్చేలా అప్ డేట్ తీసుకొచ్చారు. అందుకు మీరు మీ ఫేస్ బుక్ ఖాతాని వాట్సాప్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా అంతకన్నా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తీసుకురానున్నట్లు Wabetainfo వెల్లడించింది. త్వరలోనే వాట్సాప్ లో యానిమేటెడ్ ఏమోజీలను తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ గనుక వస్తే.. యూజర్లు సొంతంగా యానిమేటెడ్ ఏమోజీలను తయారు చేసుకోవచ్చు.
నిజానికి ఇలాంటి ఆప్షన్స్ థర్డ్ పార్టీ యాప్స్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ, వాట్సాప్ లో ఇలాంటి ఫీచర్ ని తీసుకురావడంపై యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యానిమేటెడ్ ఏమోజీల కోసం ఇంక వేరే యాప్స్ అవసరం లేదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. అంతేకాకుండా దీనితో పాటుగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రీ డిజైన్డ్ కీ బోర్డుని కూడా తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న కీబోర్డ్ స్థానంలో వాట్సాప్ సరికొత్త కీబోర్డుని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కేటగిరీస్ బార్ ని తొలగించి.. సెలక్షన్ బార్ ని బాటమ్ నుంటి టాప్ కి తీసుకురానున్నట్లు టాక్ నడుస్తోంది. వాట్సాప్ నుంచి రానున్న కొత్త ఫీచర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.