ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జంక్షన్‌లో విషాదం చోటుచేసుకుంది. రైలు ఎక్కబోతున్న ఒక జవాన్‌ను టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) కిందకి తోసేశాడు. ఈ ప్రమాదంలో సదరు జవాన్ రెండు కాళ్లు కోల్పోయాడు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హేయమైన చర్యకు పాల్పడ్డ సదురు టీటీఈని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం.. బాధితుడు సోను కుమార్ దిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బి8 బోగిలోని థర్డ్ ఏసీలో ప్రయాణిస్తున్నాడు. అయితే, బరేలీ స్టేషన్‌లో రైలు ఆగడంతో మంచినీళ్ల కోసం అతడు కిందికి దిగాడు.
అయితే, ఆలోపే ట్రైన్ కదలడంతో పరుగెత్తుతూ రైలు ఎక్కడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో టీటీఈ, అతనికి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సహనం కోల్పోయిన టీటీఈ అతన్ని దుర్భాషలాడడమే కాకుండా కిందకు తోసేశాడు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయి. దాంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం తీవ్రగాయాలు కావడంతో డాక్టర్లు సోను కుమార్ రెండు కాళ్లను తీసేశారు. ఈ సంఘటన తెలియడంతో కోపోద్రిక్తులైన ఇతర జవాన్లు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి వేసి, టీటీఈను చితకబాదారు. విషయం పెద్దది కావడంతో అక్కడికి చేరుకున్న రైల్వే అధికారులు, జీఆర్‌పీ ఆర్‌పీఎఫ్ పోలీసులు ఇతర జవాన్లనకు నచ్చజెప్పారు. ఈ సంఘటనతో రాజధాని ఎక్స్‌ప్రెస్ గంట ఆలస్యంగా బయలుదేరింది.
बरेली में गुरुवार को राजधानी एक्सप्रेस में टीटीई ने फौजी को धक्का (tte pushed army soldier from rajdhani express) दे दिया. इसके चलते चलती ट्रेन से नीचे गिरने से जवान के पैर कट गए. pic.twitter.com/yqYPs73WDD
— रमाशंकर दुबे पत्रकार (@JanaYuja) November 17, 2022
#Delhi जा रही राजधानी एक्सप्रेस में टीटी ने फौजी को ट्रेन से धक्का दे दिया।
ट्रेन से गिरने पर फौजी के दोनो पैर कट गए।#RajdhaniExpress #IRCTC pic.twitter.com/Vjn3uXr325
— Khushboo Khan 🇮🇳 (@khushbookhan390) November 17, 2022