దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా.. రోడ్డు భద్రతా చర్యలు చేపట్టినా కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి, అతి వేగం, నిద్ర లేమితో డ్రైవర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. జోధ్‌పుర్‌లో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడే మృతి చెందారు.
పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చెప్పట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛ్చాయలు నెలకొన్నాయి. దైవ దర్శనానికి వెళ్తుండగా జైపూర్ జాతీయ రహదారిపై అర్థరాత్రి పూట ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్పాట్ లోనే ఆరుగురు చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.