భార్యాభర్తలు పిల్లలు కనడం అనేది సృష్టిలో భాగమనే చెప్పాలి. అలా పెళ్లైన భార్యాభర్తల కాపురంలో కొంత కాలానికి పిల్లలు జన్మిస్తూ ఉంటారు. కానీ అదే భర్త భార్యకు దూరంగా ఉంటే ఎలా? మరీ ముఖ్యంగా భర్త జైళ్లో జీవిత ఖైదీగా మారిపోతే భార్యకు భర్తతో కలిసి పిల్లలు కనే భాగ్యం లేనట్లేనా అనే అంశంపై తాజాగా రాజస్థాన్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు వెలువరించింది.
ఇది కూడా చదవండి: మాజీ ఎమ్మెల్యే భార్య మంచి మనసు.. కోట్ల విలువైన ఆస్తి విరాళం!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్ కి చెందిన లాల్ అనే వ్యక్తికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే ఓ కారణంతో భర్తకు జీవిత ఖైదీగా శిక్షపడింది. కాగా కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న భార్య భర్తతో కలిసి పిల్లలు కనేందుకు సిద్దపడింది. కానీ భర్త మాత్రం జైళ్లో ఉన్నాడు. ఇదే విషయంపై లాల్ భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిని విచారించిన రాజస్థాన్ హైకోర్టు ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. దీంతో పాటు రూ. 25వేల చొప్పున రెండు పూచీకత్తులతో పాటు రూ.50వేల వ్యక్తిగత బాండ్ ను అందించి లాల్ ను 15రోజుల పెరోల్ పై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక తాజాగా ఇచ్చిన న్యాయస్థానం తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.