ఎప్పుడైన హానికరమైన జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. అయితే కొందరు మాత్రం వాటి వద్ద అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. మరీ ముఖ్యంగా కొందరు తాగిన మైకం వాటితో విన్యాసాలు చేస్తుంటారు. అలా తాగిన మైకంలో వారు చేసే పనులు..ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తాయి. ఇలా కొందరు జూల్లోని పులు బోనులోకి దూకి దానికి ఆహారమైన వారు ఉన్నారు. మరికొందరు గాయాలతో బయటపడిన వారు ఉన్నారు. తాజాగా ఓ తాగుబోతు మద్యం మత్తులో కొండ చిలువను తీసుకుని మెడకు చుట్టుకున్నాడు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కొండ చిలువ..ఒక్కసారిగా ఆ వ్యక్తి మెడను చుట్టేసి..గట్టిగా పట్టేసింది. విడిపించేందుకు బాధితుడి కొడుకు, మరొక వ్యక్తి ప్రయత్నించారు. చాలా సమయం పాటు పోరాడి.. దాని నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. దాదాపు ఆ వ్యక్తి చావులు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఈఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
జార్ఖండ్ రాష్ట్రం గర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిహార పంచాయతీలోని కితాసోటి ఖుర్ద్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల బిర్జాలాల్ రామ్ భూయన్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భూయాన్..స్థానికంగా ఉన్న అన్నరాజ్ డ్యామ్ నుండి వచ్చే కాలువ వద్దకు వెళ్లాడు. అక్కడ నీటి లోతులేని ప్రాంతంలో చేపలు పట్టేందుకు సిద్దమయ్యాడు. అయితే అప్పటికే మద్యం తాగి ఉన్నాడు. ఈ క్రమంలో అతడి కళ్లు ఓ కొండ చిలువపై పడ్డాయి. దానిని పట్టుకుని కొద్ది సేపు ఆటలు ఆడాడు. అంతటితో ఆగక పామును వేసుకున్నట్లు కొండచిలువను మెడలో వేసుకుని తాండవం చేయసాగాడు. ఆ కొండ చిలువ కాస్తా.. అతడి మెడను చుట్టేసి..గట్టిగా పట్టేసింది.
దీంతో అతడికి ఊపిరాడక రక్షించమని గట్టిగా అరవడం ప్రారంభించాడు. అక్కడే దగ్గర్లో ఉన్న ఆయన కొడుకు, మరొక వ్యక్తి అక్కడి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు ఆ కొండ చిలువతో పోరాడి తండ్రి ప్రాణాలను కాపాడాడు. అయితే కొండ చిలువను తప్పించే క్రమంలో భూయన్ రాళ్లపై పడి స్వల్ప గాయాలయ్యాయి. సాధారణంగా కొండ చిలువ ఏ జీవినైనా చుట్టేసి.. అమాంతం మింగేస్తుంది. దాని నుంచి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం. కానీ భూయన్ కి భూమి మీద నూకలు ఉండి బతికిపోయాడు. కొండ చిలువ ఇచ్చిన షాక్ కి భూయాన్ కి తాగిన మత్తు వదలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Drunk man went for fishing 🎣, caught a Python, wrapped it around his body – Python started chocking him… Don’t miss that boy at 0.40sec, WTF was he Planning 😂pic.twitter.com/QRwH6Q6Q7I
— Mihir Jha (@MihirkJha) November 10, 2022