సాధారణంగా చిన్న పిల్లలు గాల్లో ఎగిరే విమానాలు, హెలికాప్టర్ ని చూసి తెగ సంబరపడిపోతుంటారు. వాటిలో ఒక్కసారైన ఎక్కి ఎంజాయ్ చేయాలని భావిస్తారు. అలాంటి చిన్నారుల కోరిక తీరుస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ ఎనలేని ఆనందాన్ని కల్పించారు. కొంత మంది చిన్నారులను తన హెలికాప్టర్‌లో ఎక్కించుకొని తిప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. హెలికాప్టర్ ఎక్కిన చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
‘ఇది ప్రజా ప్రభుత్వం.. మొరిండాలో పిల్లలతో హెలికాప్టర్ రైడ్‌ని చేయించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారికి ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తును అందించడమే మా ప్రయత్నం’ అని పేర్కొంటూ వీడియోను ట్వీట్ చేశారు. రెండోసారి మరింతమంది పిల్లలను హెలికాప్టర్‌లో తీసుకెళ్లనున్నట్టు సీఎం తెలిపారు. పంజాబ్ చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం తాను పాటుపడతానని వివరించారు.
ఇదిలా ఉంటే.. పంజాబ్ ఎన్నికలు సమీపిస్తోన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను నేతలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీతోపాటు ఆప్ కూడా పాగా వేయాలని అనుకుంటున్నాయి. కాగా, కొత్త పార్టీని ప్రకటించిన అమరీందర్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సవాలు విసిరేందుకు సిద్ధమయ్యారు.
Government of the people, for the people !
Elated to share chopper ride with children in Morinda. My endeavour is to ensure a bright and prosperous future for them by providing equal opportunities in all spheres. pic.twitter.com/16saRekScZ— Charanjit S Channi (@CHARANJITCHANNI) November 29, 2021
During my visit to Morinda, saw children playing near the helicopter. When I was young, I used to see planes & think that one day I too would get a chance to sit in it. Reminiscing about the same, I made a few village children fly with me in helicopter & fulfilled their dream.
— Charanjit S Channi (@CHARANJITCHANNI) November 28, 2021