పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు అధికారులు. భగవంత్ మాన్ కి ఉన్నట్టుండి వీపరీతమైన కడుపు నొప్పి రావడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించారు. ఆయనకు ఇంద్రప్రస్థ ఆపోలో హాస్పిటల్ లో వైద్యం చేస్తున్నారు. సీఎం ఆస్పత్రిలో చేరడంతో.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
అంతకుముందు అమృత్‌సర్ సమీపంలో పంజాబ్ పోలీసులతో భారీ ఎదురుకాల్పుల్లో ఇద్దరు హంతకులు హతమైన తర్వాత రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ విజయవంతంగా అమలు చేసినందుకు పోలీసులు, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. మృతులను జగ్‌రూప్‌సింగ్ రూపా, మన్‌ప్రీత్‌సింగ్ అలియాస్ మన్ను కుసాగా గుర్తించారు పోలీసులు
ఈ ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. కాగా, గ్యాంగ్‌స్టర్‌లు, సంఘవ్యతిరేక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రారంభించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం నింధితులు ఎవరైనా వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: వరద ముంపు నుండి 1200 మందిని రక్షించిన రియల్ హీరో!