గత కొంత కాలంగా పెట్రోల్, డిజీల్ రేట్లు వీపరీతంగా పెరుగుతూ వచ్చాయి. దీనితో పాటే వంట నూనె ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. అసలే కరోనా ప్రభావంతో ఆర్థికంగా కష్టాలు పడుతున్న సామాన్యులకు ఈ ధరల పెరుగుదలతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల రేట్లు ఇలా పెరిగుతూ పోతుంటే బతికేది ఏలా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు కాస్త ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రం వంట నూనె దిగుమతి సుంకాలను తగ్గించడంతో ధరలు దిగి వచ్చాయి. ఇక క్రూడ్ పామాయిల్ ధరలపై దిగుమతి సుంకాలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ బోర్డు ఆప్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ నోటిఫికేషన్ ద్వారా అగ్రి ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ సెస్‌ను ఫిబ్రవరి 13 నుంచి7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు సమాచారం.
ఇది చదవండి: రైలు పట్టాలపై బాలిక! ప్రాణాలకి తెగించి కాపాడిన యువకుడు!
ఇక ఎడిబిల్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలోని రిఫైనర్లకు పామాయిల్ మరింత చౌకగా దిగుమతి కానున్నది. దిగుమతి సుంకం తగ్గింపు నిన్నటి నుంచే అమలులోకి వచ్చింది. ప్రస్తుతం దిగుమతి పన్ను గ్యాప్ 8.25 శాతం ఉందని, ఈ గ్యాప్ 11 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని, 11 శాతానికి పెంచితే దేశంలోని రిఫైనరీలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఎస్ఈఏ తెలియజేసింది.