2021 ఏడాదికి సంబంధించి పద్మ అవార్డుల గ్రహీతల పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్ అవార్డులు, 10 మందికి పద్మభూషణ్ అవార్డులు, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన వారికి ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం.
అవార్డులు అందుకుంటున్న వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు 16 మందికి మరణానంతరం పద్మ అవార్డులు ఇస్తుండగా.. ఒక ట్రాన్స్‌జెండర్‌కు కూడా అవార్డు దక్కనుంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి.. ఒలింపియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పద్మభూషణ్‌ను వరించింది. ఈ మేరకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఇక పద్మవిభూషణ్ అవార్డు దక్కిన వారిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (తమిళనాడు) ఉన్నారు.
కర్ణాటకకు చెందిన బెల్లె మోనప్ప హెడ్గే (మెడిసన్), అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కపాని (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), ఢిల్లీకి చెందిన మౌలానా వహిద్దీన్ ఖాన్ (స్ప్రిట్యులిజమ్), జపాన్ దేశానికి చెందిన శ్రీ షింజో అబే (పబ్లిక్ అఫైర్స్), ఢిల్లీకి చెందిన బీబీ లాల్ (ఆర్కియాలజీ), ఒడిశాకు చెందిన శ్రీసుదర్శన్ సాహూ (ఆర్ట్) పద్మ విభూషణ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Adding more colours to India’s diversity through their creative art, soulful music, dance performances, etc. Presenting the awardees conferred with Padma Awards 2020 from the field of Arts. #PeoplesPadma pic.twitter.com/hKHzVk7Hvy
— MyGovIndia (@mygovindia) November 8, 2021