YS Jagan Mohan Reddy: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు, హాకీ క్రీడాకారిణి రజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధు, రజని కామన్‌వెల్త్ క్రీడల్లో సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తన ట్విటర్ ఖాతాలో తెలియజేసింది. ‘‘క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ అంతర్జాతీయ క్రీడాకారులు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజని.
కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన ఘనవిజయాలపట్ల అభినందనలు తెలియజేసిన సీఎం’’ అని పేర్కొంది. అంతేకాదు! ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. కాగా, పీవీ సింధు తాజాగా బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్-2022లో బంగారు పతాకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఉమెన్స్ సింగిల్స్‌లో కెనడాకు చెందిన లీపై విజయం సాధించింది. 21-15, 21-13తో గెలిచింది. మరి, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు, హాకీ క్రీడాకారిణి రజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన రాష్ట్రానికిచెందిన సుప్రసిద్ధ అంతర్జాతీయ క్రీడాకారులు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజని. కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన ఘనవిజయాలపట్ల అభినందనలు తెలియజేసిన సీఎం. @Pvsindhu1 #Andhrapradesh pic.twitter.com/ZH1Q4ot7Rx
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 25, 2022
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 25, 2022
ఇవి కూడా చదవండి: YS Jagan Mohan Reddy: కుట్రదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.. రాళ్లు వేస్తున్నారు: సీఎం జగన్