బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు షటిల్ కోర్టులోనే కాకుండా బయట కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే సింధు..ఈ కాలం అమ్మాయిలా ట్రెండ్ ను ఫాలో అవుతుంది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ ‘జిగిల్ జిగిల్’లో పాటకు డ్యాన్స్ చేసింది. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో నెట్ లో వైరల్ అయింది. సింధు స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సింధుకు డ్యాన్స్ అంటే ఇష్టం.
ఈ మద్య పీవీ సింధు కొన్ని కార్యక్రమాల్లో ట్రెండీ లుక్ తో కనిపిస్తున్నారు. ఎంత మోడ్రన్ గా ఉన్నప్పటికీ తనకు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలిపింది. తాజాగా చీర కట్టులో ఈ మద్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్న జిగిల్ జిగిల్ అనే పాటకు అనుగుణంగా ట్రెండీ స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సింధు వేసిన డ్యాన్స్ చూసి అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.. ఆటలోనే కాదు డ్యాన్స్ లోనూ నీకు నువ్వే సాటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో కూడా పీవి సింధూ పలు సందర్భాల్లో సాంప్రదాయ లుక్ తో కనిపించడమే కాదు డ్యాన్స్ కూడా చేసింది. గత వారం గుజరాత్ లో జరిగిన జాతీయ క్రీడల ప్రారంభోత్సవానికి వెల్లి గుజరాతీ సాంప్రదాయ దుస్తులు ధరించిన గర్భా నృత్యం చేసి అందరిచే షభాష్ అనిపించుకుంది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెల్చుకుంది.