టీ20 వరల్డ్ కప్ 2022 కోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా వెళ్లి లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. వరల్డ్ కప్ గెలుపే లక్ష్యంగా కొన్ని వారాల ముందే ఆసీస్ గడ్డపై అడుగుపెట్టి.. అక్కడి బౌన్సీ, పేస్ పిచ్‌లపై ప్రాక్టీస్ మొదలపెట్టింది టీమిండియా. సోమవారం వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టులో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా 13 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బౌలింగ్ విభాగం కూడా పర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చి.. యువ క్రికెటర్లకు అవకాశం కల్పించారు. కాగా.. ఇదే విషయంపై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు రిపోర్టర్ల నుంచి ఒక కఠిన ప్రశ్న ఎదురైంది.
వెస్టర్న్ ఆస్ట్రేలియాతో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఎందుకు తీసుకోలేదని రిపోర్టర్ అడగ్గా.. ఈ విషయం గురించి చెప్పాలంటే.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానంలోకి వస్తే చెప్పగలను. జట్టులోని మార్పులు, స్ట్రాటజీల్లో ఆయన దిట్ట అని అశ్విన్ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. కాగా.. విరాట్ కోహ్లీని ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎందుకు ఆడించలేదు, యువ క్రికెటర్లకు ఎందుకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి విషయాలన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కే బాగా తెలిసి ఉంటాయి.. వాటి గురించి నేనేలా చెప్పగలను అని అశ్విన్ ఉద్దేశం అయి ఉంటుంది. నిజానికి జట్టులో విరాట్ కోహ్లీ కన్నా యవ క్రికెటర్లకే అవకాశం ఇవ్వడం కరెక్ట్ అని క్రికెట్ నిపుణులు సైతం భావిస్తున్నారు.
అశ్విన్ మాట్లాడుతూ.. ‘టీ20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ ఆస్ట్రేలియాలో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి బౌన్సీ, పేస్ పిచ్‌లపై మా జట్టులోకి చాలా మంది యువ క్రికెటర్లకు ఆడిన అనుభవం లేదు. వరల్డ్ కప్‌కు కాస్త ముందుగా ఇక్కడికి రావడం కచ్చితంగా మాకు కలిసొచ్చే అంశం. చాలా కాలం నుంచి మేము ఆస్ట్రేలియా రాలేదు. అందుకే కాస్త ముందు వచ్చి ఎక్కువగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటంతో ఒక్కడి పిచ్‌లపై మాకు, మా యువ క్రికెటర్లకు కాస్త పట్టు దొరుకుతుంది.’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
Ravichandran Ashwin spoke about the importance of acclimatisation and early preparations as India continued their fine-tuning in Australia in the lead up to the #ICCT20WorldCup2022.https://t.co/kzwUGPdSRS pic.twitter.com/8qmAFJDTXL
— Cricbuzz (@cricbuzz) October 10, 2022