ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే భారత జట్టు అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై సిరీస్ లు నెగ్గి టీ20 వరల్డ్ కప్ కు ముందు.. ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక ఆసిస్ లో అడుగు పెట్టిన టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారీ షాట్లతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోహ్లీ ప్రాక్టీస్ చేసే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కింగ్ కోహ్లీ.. ఆసియా కప్, ఆసిస్, సౌతాఫ్రికా సిరీస్ లతో భీకర ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇదే ఫామ్ ను టీ20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్లే.. ఆసిస్ గడ్డపై ప్రాక్టీస్ మెుదలు పెట్టాడు. తాజాగా సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ కు కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అదీ కాక ఆసిస్, న్యూజిలాండ్ లతో కూడా మరికొన్ని రోజుల్లో వార్మప్ మ్యాచ్ లు టీమిండియా ఆడబోతుంది. దానిలో భాగంగానే టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ లో తీవ్రంగా చమటోడ్చుతున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ భారీ షాట్లతో నెట్స్ లో విరుచుకుపడుతున్న వీడియో నెట్టింట రచ్చ లేపుతోంది.
ఈ క్రమంలోనే పుల్ షాట్స్, స్ట్రెయిట్ డ్రైవ్ షాట్లను కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక ఈ వీడియోను చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 23 న టీమిండియా చిరకాల ప్రత్యర్థి అయిన పాక్ తో తొలి మ్యాచ్ ను ఆడనుంది. ఇక ఈ ప్రాక్టీస్ షాట్స్ చూసిన ఫ్యాన్స్.. పాకిస్థాన్ కు ఇక చుక్కలే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో భీకర ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మరో సారి చెలరేగాడు. SKY కేవలం 35 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 52 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహులకు విశ్రాంతిని ఇచ్చి పంత్ ను జట్టులోకి తీసుకున్నారు.
Virat Kohli started Practicing in nets before World Cup.pic.twitter.com/9KsEDSfrhb
— Mufaddal Vohra (@mufaddel_vohra) October 8, 2022