ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ తీసిన సినిమాల్లో ఆమె, మగరాయుడు,ఆరుగురు పతివ్రతలు వంటి ఉమన్ సెంట్రిక్ సినిమాలే కాకుండా మా నాన్నకు పెళ్లి, కన్యాదానం వంటి విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు చేశారు. వీటిలో విమర్శించిన నోళ్లే ప్రశంసించేలా చేసిన సినిమా కన్యాదానం. ‘అవ్వా ఏంటీ పెళ్లాన్ని. ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడా భర్త’ అన్న వారితోనే.. సినిమా చూశాక శభాష్ అనిపించేలా చేశాడు. అయితే ఇదే సీన్ ...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫన్, ఫ్యామిలీ సినిమాలతో పాటు రెవల్యూషనరీ, ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసిన అతి గొప్ప దర్శకుల్లో ఇవివి సత్యనారాయణ ఒకరు. ఆయన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. కడుపుబ్బా నవ్వించే జంబలకిడి పంబ, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, కితకితలు, ఎవడిగోల వాడిదే వంటి సినిమాలే కాదూ.. ఆమె, మగరాయుడు వంటి ఉమన్ సెంట్రిక్ సినిమాలే కాకుండా మా నాన్నకు పెళ్లి, కన్యాదానం, ఆరుగురు పతివ్రతలు వంటి విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు చేశారు. వీటిలో విమర్శించిన నోళ్లే ప్రశంసించేలా చేసిన సినిమా కన్యాదానం. ‘అవ్వా ఏంటీ పెళ్లాన్ని. ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడా భర్త’ అన్న వారితోనే.. సినిమా చూశాక శభాష్ అనిపించేలా చేశాడు. ఈ సినిమా చర్చించుకోవడమే కాదూ.. కలెక్షన్ల సునామీ కురిపించింది. ఇందులో హీరో హీరోయిన్లుగా.. శ్రీకాంత్, ఉపేంద్ర, రచనలు నటించారు. విభిన్నమైన కథతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఓ భర్త కూడా తన భార్యకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసి.. రియల్ లైప్ లో మరో శ్రీకాంత్ అయ్యాడు.
భార్య మనస్సు తెలుసుకుని.. ప్రియుడికిచ్చి భర్త పెళ్లి చేసిన ఈ ఘటన జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో జరిగింది. అది కూడా పెళ్లైన 20 రోజుల్లోనే. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కిలా గ్రామానికి చెందిన.. సనోజ్ కుమార్ సింగ్‌తో లెస్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కదిహ్ నివాసి అయిన ప్రియాంక కుమారికి మే 10న పెద్దలు పెళ్లి చేశారు. అయితే ప్రియాంక..తన గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని 11 ఏళ్లుగా ప్రేమిస్తుంది. జితేంద్ర విశ్వకర్మ, ప్రియాంక 2012 నుండి ప్రేమించుకుంటుండగా.. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. వీరి ప్రేమ వ్యవహారం తెలియడంతో.. ప్రియాంకకు.. సనోజ్ కుమార్‌తో వివాహం జరిపించారు. జితేంద్రతో పీకల్లోతు ప్రేమలో ఉన్న ప్రియాంక.. పెళ్లైన తర్వాత కూడా అతడిని మర్చిపోలేకపోయింది. తరచూ ఇద్దరూ ఫోనులో మాట్టాడుకునేవారు.
అయితే ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడంతో.. ఇంట్లో నుండి పారిపోవాలనుకున్నారు. అనుకున్నట్లే ప్లాన్ చేసుకున్నారు. ఈ మంగళవారం ప్రియాంకను తీసుకెళ్లేందుకు జితేంద్ర.. కిలా గ్రామానికి వచ్చాడు. ప్రియాంకను తీసుకుని జితేంద్ర ఇంట్లో నుండి పరారయ్యారు. వీరు పారిపోవడం గ్రామస్థుల కంట పడింది. మహిళ భర్త సనోజ్‌కు సమాచారం అందించారు. సనోజ్ వారి వద్దకు వెళ్లి.. భార్యను ఏమీ అనకపోగా.. ఆమె ఇష్టపడ్డ వ్యక్తికి అప్పగించి గొప్ప మనస్సు చాటుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు పోలీసులకు చేరింది. అయితే ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోవడంతో పాటు వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు