సాధారణంగా ఎన్నికల వేళ జరగని చిత్రాలంటూ ఉండవు. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అభ్యర్థుల కష్టాలు మాములుగా ఉండదు. ఓటర్లను ఆకర్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. గల్లీ గల్లీ తిరుగుతూ ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇచ్చారు.. ఎలా ప్రసన్నం చేసుకున్నారు అన్నదానిపై దృష్టి పెడుతూ ఉంటారు. ఒకరు దోసలు వేస్తుంటే..మరొకరు అంట్లు తోముతూ.. ఇకరు ఇస్గ్రీ చేస్తే.. మరొకరు గడ్డం చేస్తూ రక రకాలుగా ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తుంటారు.
ఎన్నికల సమయంలో ఓ అభ్యర్థి చేసిన ఫీట్ హాట్ టాపిక్ అయ్యింది. మద్దతుదారులను క్షమించాలని కోరుతూ.. గుంజీలు తీయడం విశేషం. యూపీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2022, ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇంకా మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోన్ భధ్రకు చెందిన భూపేష్ చౌబే రాబర్ట్స్ గంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. స్థానికంగా అతనికి వ్యతిరేక గాలులు వీస్తున్నప్పటికీ.. బీజేపీ మళ్లీ టికెట్ ఇచ్చింది.
ఇది చదవండి: ప్రపంచ క్రికెట్‌లో ఆ అద్భుతం తొలిసారి జరిగి నేటికి 12 ఏళ్లు
మార్చి 7న జరిగే చివరి దశలో ఇక్కడ పోలింగ్ జరుగనున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ఆయన బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. గత ఐదు సంవత్సరాల్లో తాను తప్పు చేసి ఉంటే… క్షమించాలంటూ వేదిక మీద గుంజీలు తీశారు. నన్ను క్షమించాలని.. చేతులు జోడించి వేడుకుంటున్నా అని అంటూ ఆయన గుంజీలు తీయడంతో పక్కన ఉన్న నాయకులు ఆయన్ని వారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.