షాజాహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఎంతో ప్రేమతో నిర్మించి అపురూప కట్టడం తాజ్ మహల్. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ అందాలను చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు ప్రతిరోజూ అక్కడికి వెళ్తుంటారు. ఇటీవల తాజ్ మహల్ పై పలు వివాదాలు చెలరేగుతున్నాయి.
తాజ్ మహల్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ని చూడటానికి విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆగ్ర కి వెళ్లి తాజ్ మహల్ ని సందర్శించి వస్తుంటారు. షాజాహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఎంతో ప్రేమతో నిర్మించి అపురూప కట్టడం తాజ్ మహల్. ఇది పవిత్ర ప్రేమకు చిహ్నం అని అంటుంటారు. ఇటీవల తాజ్ మహల్ పై పలు వివాదాలు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఎమ్మెల్యే తాజ్ మహల్ ప్రేమ చిహ్నం కాదు.. వెంటనే కూల్చి వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అస్సాం.. జోర్హాట్ జిల్లా మరియానీ నియోజకవర్గం ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ తాజ్ మహల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి షాజాహాన్ నిర్మించిన తాజ్ మహల్ అసలు ప్రేమ చిహ్నం కానేకాదు. ఆయన తన నాలుగో భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడు. షాజాహాన్ చక్రవర్తికి ముంతాజ్ అంటే అంత ప్రేమ అయితే.. ఆమె చనిపోయిన తర్వాత ఏకంగా మూడు పెళ్లిళ్లు ఎలా చేసుకుంటాడు అని ప్రశ్నించాడు. అంటే ఆమెపై నిజమైన ప్రేమ ఉన్నట్లా లేనట్టా? ఒకవేళ నాలుగో భార్య అయిన ముంతాజ్ పై ఉన్న ప్రేమకు తాజ్ మహల్ నిదర్శనంగా బావిస్తే.. మరి మిగిలిన భార్యామణుల సంగతి ఏమిటి అని.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ మాట్లాడుతూ.. మొఘల్ చక్రవర్తుల్లో ఒకరు అయిన జహంగీర్ 20 పెళ్లిళ్లు చేసుకున్నాడు. షాజాహాన్ చక్రవర్తి ఏకంగా ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అందులో నాలుగో భార్యపై అమితమైన ప్రేమ చూపించేవాడని.. ఆమె చనిపోయిన తర్వాత ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ నిర్మించారని చెబుతున్నారు. ఇలాంటి వారి గురించి రాబోయే తరాల వారు తెలుసుకోవాలని అనుకోవడం లేదని అన్నారు. తాజాగా NCERT మొఘల్ చక్రవర్తలుపై పాఠ్యాంశాలను తగ్గించాలన్న నిర్ణయం తీసుకోవడంపై మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు. అంతేకాదు మొఘల్ కాలం నాటి తాజ్ మహల్, కుతుబ్ మినార్ లను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు. ప్రపంచంలోనే కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతమైన ఆలయాలను నిర్మించాలని గతంలో మోదీ తెలిపారని.. ఆలయాల నిర్మాణానికి ఏడాది జీతం కూడా విరాళంగా ఇస్తానని అన్నారు ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ.
#WATCH | Taj Mahal is not the symbol of Love. built Tajmahal in memory of his 4th wife Mumtaz. If he loved Mumtaz, then why he married three times more after the death of Mumtaz: Rupjyoti Kurmi, BJP (05.04) pic.twitter.com/raMN4obqdj
— ANI (@ANI) April 6, 2023