సాధారణ పౌరులే ఆఫీస్ లో పని చేసేటప్పుడు సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. అలాంటిది బాధ్యతాయుతమైన రాజకీయ పదవిలో ఉన్న నాయకులు ఇంకెంత ఆలోచించాలి. అది ఆలోచించకపోగా ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఒక ఎమ్మెల్యే తన ఫోన్ లో బూతు వీడియోలు చూస్తూ బుక్కయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కార్యాలయం అంటేనే పని చేసే ఆలయం అని అర్థం. అలాంటి కార్యాలయంలో బూతు పనులు అనేవి చేయకూడదు. విలువైన ఆఫీస్ సమయాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు. పైగా ఆ సమయంలో పని చేయడం మానేసి సెల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడడం ఇంకా పెద్ద తప్పు. ఇక ఎమ్మెల్యే, ఎంపీ వంటి స్థానాల్లో ఉన్న వారు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నా ఎవరూ అడగరు. కానీ వృత్తిపరమైన జీవితంలోనే ఏం చేసినా అడుగుతారు, అది మంచైనా, చెడైనా. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే దేవాలయం లాంటి అసెంబ్లీలో తాను ప్రజాప్రతినిధి అన్న సంగతి మరిచిపోయి ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు.
వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కవ్వడంతో బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జాదబ్ లాల్ నాథ్ వివాదంలో ఇరుక్కున్నారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పో*ర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు. త్రిపుర రాష్ట్రంలోని బాగ్బస నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జాదబ్ లాల్ నాథ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఫోన్ లో బూతు వీడియోలు చూస్తున్నారు. ఈ విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవ్వగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఎమ్మెల్యేపై నెటిజన్స్ మండిపడుతున్నారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు.
గతంలో కూడా మొబైల్ ఫోన్ లో బూతు వీడియోలు చూస్తూ ఇద్దరు మంత్రులు కెమెరా కళ్ళలో పడ్డారు. అయితే తాము ఎడ్యుకేషనల్ పర్పస్ మీద, అలానే రేవ్ పార్టీల గురించి తెలుసుకోవడానికి చూశామని అన్నారు. ఇటీవలే బీహార్ పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫారంల మీద ఉన్న టీవీ స్క్రీన్లలో ప్రకటనలకు బదులు అడల్ట్ చిత్రం ప్రదర్శితమైన విషయం తెలిసిందే. దాదాపు మూడు నిమిషాల పాటు ఈ అశ్లీల చిత్రం ప్రదర్శించబడింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూసిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కామెంట్ చేయండి.
Tripura BJP MLA caught watching porn during Assembly session, video goes viral pic.twitter.com/3bLI4ahzPs
— India Today NE (@IndiaTodayNE) March 30, 2023