పెళ్లి.. జీవితంలో ఒకేఒక్కసారి జరిగే మధురమైన ఘట్టం. ఇలాంటి వేడుకని తమకి నచ్చినట్టు అంగరంగ వైభవంగా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ.., ఇందుకు కొన్ని పరిమితులు ఉంటాయి. తాజాగా తన పెళ్లి సందర్భంగా ఓ యువతి చేసిన పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకి కారణం అయ్యింది.
మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన శుభాంగి జరాదే అనే యువతి ఇటీవల ఘనంగా వివాహం జరిగింది. సాస్వద్‌లోని సిద్దేశ్వర ఫంక్షన్ హాల్‌లో ఈ పెళ్లి జరిగింది. అయితే.. మండపానికి వచ్చే సమయంలో పెళ్లి కూతురు కారులో కాకుండా, కారు బ్యానెట్ పై కూర్చొని ఊరేగింపుగా మండపానికి చేరుకుంది.
ఎలాగో, బ్యానెట్ పైకి ఎక్కింది కదా అని వీడియో గ్రాఫర్స్, ఫొటో గ్రాఫర్స్ రోడ్ పైనే ఫోటో సెషన్ షురూ చేసేశారు. కానీ.., ఈ సమయంలో ఆ యువతి గాని, ఆమె కుటుంబ సభ్యులు గాని, ఫోటో గ్రాఫర్స్ గాని ఎలాంటి కోవిడ్ నిబంధలను పాటించలేదు. కనీసం మొహానికి మాస్క్ కూడా పెట్టుకోలేదు. దీంతో.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు వీరందరిపై కేసు నమోదు చేశారు.
విపత్తు నిర్బహన చట్టం ప్రకారం వీరిపై సెక్షన్ 269, 188, 107 కింద కేసులు నమోదు చేశారు. దీంతో.. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అంతా యువతి చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు. కరోనా నిబంధనలను అతిక్రమించడమే కాకుండా.., కార్ బ్యానెట్ పై ఏ మాత్రం భయపడకుండా ఫోటోలకి ఫోజులు ఇచ్చిన ఈమె దైర్యం గురించి చర్చించుకుంటున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.