సమాజంలో కొంత మంది వ్యక్తులు తమకు తాము గొప్ప అనుకుంటారు. తమకు ఏ నిబంధనలు వర్తించవు అన్నట్లు ప్రవర్తిస్తారు. అదీ కాక ఇతరులపై పెత్తనం చెలాయిస్తూ దాడి కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టోల్ ఛార్జీ కట్టమన్నందుకు టోల్ బూత్ సిబ్బందిపైనే దాడి చేశాడో వ్యక్తి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ రాజ్‌ఘడ్-భోపాల్ కచ్‌నారియా టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ గుజార్ అనే వ్యక్తి కారులో టోల్ ప్లాజ వద్దకు వచ్చాడు. అతడి కారుకు ఫాస్ట్ ట్యాగ్ లేకపోవడంతో సిబ్బంది రుసుము చెల్లించాల్సిందిగా కోరింది. దీంతో రాజ్ కుమార్ నేను లోకల్, నాకు మీ యజమాని కూడా తెలుసు నేను డబ్బులు కట్టను అంటూ కోపంగా చెప్పాడు. అయితే అతడు స్థానికుడు అనడానికి అతని దగ్గర ఆధారాలు లేవు.. అదీ కాక యజమానికి అతడు తెలీదు అని చెప్పడంతో విధులలో ఉన్న అనురాధా దాంగా టోల్ ఛార్జీ కట్టాల్సిందే అని చెప్పింది.
దాంతో రాజ్ కుమార్ కోపంతో ఊగిపోతూ ఆమె దగ్గరకి వచ్చి తిడుతూ.. ఆమె పై దాడి చేశాడు. అనురాధ సైతం తన చెప్పు తీసి అతడిని కొట్టింది. ఇద్దరి మధ్య కొద్ది సేపు పెనుగులాట జరిగింది. ఈ ఘటనపై అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఓ మహిళా సిబ్బందిపై ఇలా చేయి చేసుకోవడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A man slapped a woman employee of a toll both in Rajgarh after she refused to let him go without paying the tax. The man is seen angrily walking towards the employee and then slapping her across the face, The woman hits him back with her footwear @ndtv @ndtvindia pic.twitter.com/hmK0ghdImX
— Anurag Dwary (@Anurag_Dwary) August 21, 2022