ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సామాన్య వ్యక్తిలా మారి.. వీధిలో ఉండే దుకాణంకి వెళ్లారు. అక్కడ వస్తువులను కొనుగోలు చేసి.. ఆ షాపు యజమానిని ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాక ఆయన కాసేపు కార్యకర్తలు, అభిమానులతో సందడి చేశారు.
ముఖ్యమంత్రి అంటే ఓ రాష్ట్రానికి అధిపతి. నిత్యం రాష్ట్ర పరిపాలన పనుల్లో బిజీ బిజీగా గడుపుతుంటారు. ప్రజల వద్దకు వెళ్లి.. సాధారణ వ్యక్తిలా కలిసిపోయి సమస్యలు తెలుసుకుంటారు. ఇలా రోజూ మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి బిజిబిజీగా గడిపేస్తుంటారు. అయితే వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. అందులో భాగంగా కుటుంబ సభ్యులతో గడుపుతుంటారు. ఆ సమయంలో తాను రాష్ట్ర సీఎం అనే విషయాన్ని మరచి ఓ సామాన్య వ్యక్తిగా కుటుంబ సభ్యులతో, మనవళ్లతో గడుపుతుంటారు. అయితే తాజాగా ఓ సీఎం కూడా తన మనవడితో తెగ సందడిగా గడిపాడు. మనవడి చెప్పడంతో ఆ సీఎం కిరాణ షాపుకు వెళ్లి కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. ఇంతకి సీఎం ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జీవిత ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా ఉంటుంది. ఓ ఆటో నడుపుకునే వ్యక్తి నుంచి సీఎం స్థాయిగా ఎదిగారు. కొంతకాలం క్రితం మహారాష్ట్ర రాజకీయాల్లో జరిగిన అనూహ్య పరిణామాలతో షిండే సీఎం పీఠం అధిరోహించారు. అయితే ఆయన సీఎం అయినా సరే… తన కార్యకర్తలతో కలిసిమెలసి ఉంటారు. అందుకే ఆయనను కార్యకర్త అని, ప్రజాఆధారిత నాయకుడు అని పిలుచుకుంటారు. గణపతి ఉత్సవాల సమయంలో ఇంటింటికీ వెళ్లి తన కార్యకర్తలను ఉత్సాహపరిచాడు. దేవి నవరాత్రుల సమయంలో థానేలోని టెంభినాకాలో కూడా ఎంతో సామాన్యుడిలా పండగను నిర్వహించారు.
ఇక తాజాగా మనుమడి మాటల తలొగ్గి… అతడు చెప్పిన పని చేశారు. హోలీ పండగ సందర్భంగా మనవడితో కలిసి పండగను ఆస్వాదించారు. ఇదే సమయంలో మనవడి ఒత్తిడితో సమీపంలోని కిరాణా షాపుకు వెళ్లారు. మనవుడు చెప్పిన వస్తువులను సీఎంఏక్ నాథ్ శిందే ఆ దుకాణంలో కొనుగోలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రే రావడంతో ఆ షాపు యజమాని ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ క్రమంలో కార్యకర్తలు అందరు సీఎం చుట్టు చేరి సందండి చేశారు. ఆయన కూడా కార్యకర్తలతో ,అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఇక సీఎం షిండే.. దుకాణానికి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. మనవడి చెప్పడంతో రాష్ట్ర సీఎం దుకాణానికి వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ठाणे – मुख्यमंत्र्यांनी पुरवला नातवाचा हट्ट, गल्लीतल्या दुकानातून केली खरेदी pic.twitter.com/EBzVLdSFm6
— Lokmat (@lokmat) March 7, 2023