వ్యభిచారగృహాలపై పోలీసులు దాడి చేసినప్పుడల్లా అక్కడ పట్టుబడిని మహిళను, విటులను అరెస్టు చేసి జరిమనా విధిస్తుంటారు. ఇటీవల వ్యభిచారం నేరం కాదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికి కొన్ని చోట్ల పోలీసులు వ్యభిచార గృహాల పై దాడులు చేసి అక్కడ పట్టుబడిన మహిళలను అరెస్టు చేయడం, వారికి జరిమానం విధించడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వ్యభిచార గృహాల్లో దాడులు జరిపినప్పుడు పట్టుబడిన సె**క్స్ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయొద్దని, వారిపై కేసులు కూడా నమోదు చేయొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. వ్యభిచార గృహంలో దొరికిన విటుడిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది మద్రాస్ హైకోర్టు. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని చింత్రాదిపేట్ లో ని ఓ వ్యభిచార గృహంలో ఉదయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు కోర్టులో క్రిమినల్ పిటిషన్ ను దాఖలు చేయగా.. అందుకు హైకోర్టు అంగీకరించింది. నిందితుడు మసాజ్ సెంటర్ కు వెళ్లినప్పుడు పోలీసులు దానిపై దాడి చేశారు. ఈ సమయంలో అక్కడ కొందరు యువతులు ఉన్నారు. దీంతో పోలీసులు వారితో పాటు పిటిషనర్ ను కూడా అరెస్టు చేశారు. అతడిని A5 గా చేర్చారు. ఈక్రమంలో మద్రాస్ హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది.వ్యభిచార గృహాల్లో దాడులు జరిపినప్పుడు సె** వర్కర్లను పోలీసులు అరెస్టు చేయొద్దని, వారిపై కేసులు కూడా నమోదు చేయొద్దని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈక్రమంలో వ్యభిచార గృహంలో ఉన్న విటుడిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది. వ్యభిచారంకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ మద్రాస్ హైకోర్టు తాజా తీర్పునిచ్చింది. మరి.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sex workers should not be arrested or penalised whenever a brothel house is raided by police, the Madras High Court has ruled. https://t.co/c5FBZoD2w7
— Hindustan Times (@htTweets) June 18, 2022