మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా లింగమార్పిడికి అనుమతి కోరుతూ రాష్ట్ర హోం శాఖకు దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తును పరిశీలించిన అధికారులు లింగమార్పిడితో ఆమె పురుషుడిగా మారేందుకు అనుమతించారు. తన చిన్నతనం నుంచే ఆ మహిళా కానిస్టేబుల్ పురుష లక్షణాలు కలిగి ఉన్నట్లు సైకాలజిస్టులు తేల్చారు. ఈ కారణంతో ఆమెను లింగ మార్చిడి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని మధ్యప్రదేశ్ హోం శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్ రాజోరా తెలిపారు.
లింగమార్పిడికి అనుమతించాలిని ఆ మహిళా కానిస్టేబుల్ 2019లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు దరఖాస్తు పంపింది. దాంతో పాటు అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దరఖాస్తును రాష్ట్ర హోం శాఖ పరిశీలించి.. నిబంధనల ప్రకారం భారత పౌరులు తమ కులం, మతంతో సంబంధంలేకుండా లింగమార్పిడి చేసుకోవచ్చని చెప్పి అనుమతి ఇచ్చింది. కాగా ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వం లింగమార్పిడికి అనుమతి ఇవ్వడం మన దేశంలోనే ఇదే తొలిసారి.