ప్రస్తుతం కాలంలో పిల్లలు ఎక్కువ పిజ్జాలు, బర్గర్లు ఎక్కువ ఇష్టపడుతుంటారు. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఆ ఆహార పదార్ధాలను కొనిస్తుంటారు. అయితే కొందరు పేరెంట్స్ అప్పుడప్పుడు మాత్రమే కొనిస్తారు. కానీ మరికొందరు మాత్రం నిత్యం పిజ్జాలు, బర్గర్ లు పిల్లలకు కొనిస్తుంటారు. దీంతో పిల్లలకి వాటిపై ఇష్టం పెరుగుతుంది. ఓచిన్నారి బర్గర్ షాప్ కు వెళ్లి బర్గర్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత తన వద్ద ఉన్న రూ.10 ఇచ్చింది. కానీ దాని ఖరీదు..రూ.90. ఆ విషయం చిన్నారికి తెలియదు. కొద్ది సమయం తరువాత పాప బర్గర్ తినుకుంటూ బయటకి వచ్చింది. మరి.. బర్గర్ ను ఆ చిన్నారి ఎలా సొంతం చేసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశ రాజధాని ఢిల్లీలోని నొయిడాలోని బొటానికల్ మెట్రో స్టేషన్ కు దగ్గర్లోని బర్గర్ షాపులోకి పదేళ్ల చిన్నారి వెళ్లింది. తన వద్ద ఉన్న రూ.10 అక్కడున్న సిబ్బందికి ఇచ్చి బర్గర్ కావాలని కోరింది. అయితే ఆ చిన్నారి ఆర్డర్ చేసిన బర్గర్ ఖరీదు రూ.90 ఉంది. ఆ విషయం తెలియక ఆ చిన్నారి అమాయకంగా అడగటంతో మిగిలిన రూ.80 చెల్లించాడు. అయితే ఆ విషయం పాపకు తెలియకుండానే రూ.10కే ఇచ్చినట్లు బర్గర్ ను తెప్పించి ఇచ్చాడు. దీంతో బర్గర్ దక్కిన ఆనందంలో ఆ చిన్నారి సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని బర్గర్ కింగ్ తన ట్విటర్ లో పోస్ట్ చేసింది. బర్గర్ కోసం ఎదురు చూస్తున్న ఆ చిన్నారి ఫోటో తీశారు. ఆ ఫోటోను లైఫ్ మెంబర్ అనే ట్విటర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఆ రూ.80 చెల్లించిన వ్యక్తి ధీరజ్ కుమార్ అనే వ్యక్తిగా గుర్తించింది బర్గర్ సంస్థ. తమ షాపుకి వచ్చిన చిన్నారి పట్ల ధీరజ్ కుమార్ ప్రవర్తించిన తీరుకు బర్గర్ కింగ్ యాజమాన్యం ప్రశంసలు కురిపించింది. అంతే కాదు అతడిని ప్రత్యేకంగా సన్మానించింది. ” ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మా నోయిడా బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రెస్టారెంట్ లో పని చేస్తున్న ధీరజ్ కుమార్ తన ప్రవర్తనతో అందరిని ఆకట్టున్నారు’ అంటూ అతడి ఫోటోలను సదరు సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పాప ముఖంలో చిరునవ్వు కనిపించడానికి కారణమైన ధీరజ్ కుమార్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
#WorldFoodDay2022 पर मेरी नज़र में इससे खूबसूरत तस्वीर और नही हो सकती.. काउंटर स्टाफ के सुनहरे भविष्य की हार्दिक शुभकामनाएं 💖💐@anandmahindra@IAmSudhirMishra @News18India @RandeepHooda @BurgerKing …👌👌👍💐 pic.twitter.com/RcAp3cKR7R
— Life Member (IFTDA) (@Life_Mem_IFTDA) October 19, 2022
This #WorldFoodDay, Dheeraj Kumar, working at our Noida Botanical Garden Metro Station restaurant, has inspired us all with his beautiful act of kindness. We had a very special guest who walked into our restaurant asking for a #burger but had only ₹10 with her. (1/3) pic.twitter.com/89oXh07sOB
— BurgerKingIndia (@burgerkingindia) October 20, 2022