ప్రభుత్వ అధికారులు అంటే ఎప్పుడూ ఏదో ఒక బిజీలో ఉంటుంటారు. ఇక జిల్లా వ్యవహరాలు మొత్తం చూసుకునే కలెక్టర్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే.. కలెక్టర్ విధులు నిర్వర్తించడం మాత్రమే కాదు.. డ్యాన్స్ ను కూడా ఇరగదీస్తారని ఓ కలెక్టర్ నిరూపించాడు.. డ్యాన్స్ మాస్టర్ ను మరిపించేలా స్టెప్పులతో అదరగొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని హెచ్‌డిఎంసి ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ గోపాల కృష్ణ తన డ్యాన్స్ తో స్టేజ్ పై దుమ్మురేపాడు. అయితే కలెక్టర్ అంతటి వ్యక్తి స్టేజ్ పై డ్యాన్స్ చేయడంతో అక్కడ ఉన్న విద్యార్థులు, అధికారులు, స్థానికులు ఆయనను ఎంకరేజ్ చేశారు.. స్టెప్పులు కలిపారు. హుబ్బళ్లి- ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ ఓ కన్నడ పాటకు డ్యాన్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని.. కాలేజీ డేస్ లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డ్యాన్స్ వేశానని ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. ఇప్పటికీ ఎక్కడైన కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగితే డ్యాన్స్ చేస్తూనే ఉంటానని తెలిపారు. ఆయన వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో కూడా పలువురు కలెక్టర్లు స్టేజ్ పై డ్యాన్స్ చేసిన వీడియోలో నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.