ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల మధ్య కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేశారు బీఎస్ యాడ్యురప్ప. ఇక ఇటీవల ఆయన ఈ నిర్ణయం తీసుకోవటంతో జీర్ణించుకోలేక తన అభిమానులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలోని గుండ్లుపేట్ తాలూకా బొమ్మలపురా గ్రామానికి చెందిన యువకుడు రవి (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా యడియూరప్ప తన ట్విటర్‌లో వేదికగా పంచుకున్నారు. ఇక గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి యాడ్యురప్పను తొలగించాలని బీజేపీ నేతలు ఎప్పటి నుంచి భావించారు.
సొంత పార్టీ నేతలే కుమ్మకై ఆయన పదవికే గాలం వేశారు. దీంతో అనూహ్య పరిణామల మధ్య ఎట్టకేలకు సీఎం పదవికి జూలై 26న యాడ్యురప్ప రాజీనామా చేశారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో రాజకీయ అస్థిరత ఏర్పాటైంది. ఎన్నో రోజుల నుంచి బీజేపీ పార్టీ నేతలే తెర వెనక మంతనాలు జరిపి ఇలాంటి వాతావారణాన్ని సృష్టించారని యడ్డీ వర్గం నేతలు పెదవి విప్పుతున్నారు. ఒక రకంగా యాడ్యురప్ప పని తీరుపై కూడా విమర్శలు ఎదుర్కొన్నాడని అప్పట్లో వార్తలు జోరుగా వినిపించాయి. దీంతో చాల సార్లు హస్తినకు వెళ్లి ప్రధాని, అమిత్ షాతో చర్చలు సైతం జరిపాడు.
ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన ఆయన నేను రాజీనామా చేస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ అబద్దం అంటూ బాహాటంగానే చెప్పుకొచ్చారు. కానీ లోలోపల జరిగే తతంగం అంతా యడ్డీ తెలుసుకోలేకపోయాడని ఓ వైపు మీడియా వర్గం కోడి కూసింది. ఇక అన్ని బాణాలు యాడ్యురప్ప వైపు చూపించడంతో రాజీనామానే సరైన మార్గమని నమ్మి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాదాపుగా 2 సంవత్సరాల కాలం పాటు సీఎం పదవిలో ఉన్నారు యాడ్యురప్ప. ఇక కొత్త నాయకుడికి సీఎం బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం తెర వెనుక మంతనాలు జరుపుతోంది.