చేతిలో స్మార్ట్ ఫోను ఉంది కదా అని ఏ వీడియో పడితే.. ఆ వీడియోను షేర్ చేసి.. వీటిపై చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు ట్యాగ్ చేస్తుంటారు. అయితే దానిలో వాస్తవాన్ని గ్రహించని వీరు.. ఏదో తాము బాధ్యతగా ఓ పని చేసేశామని చేతులు దులుపుకుంటారు. ప్రస్తుతం దేశమంతా గగొర్పాటుకు గురైన సంఘటన ఉందంటే అది ఒడిశాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్స్.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రభుత్వం, ప్రతినిధులను చర్యలు తీసుకోవడం పరిపాటి. అయితే వారిని ఎండగట్టేందుకు కొంత మంది సోషల్ సైనికులు సిద్దంగా ఉంటారు. చేతిలో స్మార్ట్ ఫోను ఉంది కదా అని ఏ వీడియో పడితే.. ఆ వీడియోను షేర్ చేసి.. వీటిపై చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు ట్యాగ్ చేస్తుంటారు. అయితే దానిలో వాస్తవాన్ని గ్రహించని వీరు.. ఏదో తాము బాధ్యతగా ఓ పని చేసేశామని చేతులు దులుపుకుంటారు. ఓ తప్పుడు సంకేతాన్ని ఇస్తుంటారు. ప్రస్తుతం దేశమంతా గగొర్పాటుకు గురైన సంఘటన ఉందంటే అది ఒడిశాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్స్. అధికారుల నిర్లక్ష్యమో లేదా కావాలనే చేశారో తెలియదు కానీ వందల మంది ప్రాణాలైతే కోల్పోయారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ఇప్పుడు కొన్ని రిలేటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అటువంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియోలో ఒక మైనర్ బాలుడు రైల్వే ట్రాకుపై రాళ్లు పెట్టాడు. ఇది చూసిన రైల్వే అధికారులు అతడిని తిడుతూ.. అతడితో ఆ రాళ్లు తీయిస్తారు. కర్ణాటకలోని జరిగిన ఈ వీడియోను ఇప్పుడు ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మరో రైలు ప్రమాదం తప్పిదంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కర్ణాటకలో రైల్వే ట్రాకును ధ్వంసం చేసే క్రమంలో ఓ బాలుడు పట్టుబడ్డాడని, దేశంల వేల కిలోమీటర్ల ఉన్న రైల్వే ట్రాకులను ఉన్నాయని, ఇంతటి విధ్యంసానికి పిల్లలను వినియోగిస్తున్నారంటూ, ఇది సీరియస్ ఇష్యూ అని, దీనిపై దృష్టిసారించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే సేవకు ట్యాగ్ చేశారు.
ఈ వీడియో మిలియన్ వ్యూస్ దాటిపోగా.. విపరీతంగా షేర్ అవుతుంది. అయితే ఈ వీడియోను పరిశీలించిన ఫ్యాక్ట్ చెక్కర్, ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహ్మాద్ జుబైర్ స్పందించారు. మరో రైలు ప్రమాదం తప్పిందంటూ షేర్ చేసిన వీడియో ఐదేళ్ల క్రితం నాటిదని, ఇది కర్ణాటక రాయ్ చూర్‌లో జరిగిందంటూ చెప్పారు. ఈ వీడియోపై రాయ్ చూర్ రైల్వే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్‌ను సంప్రదించామని, వీడియో తప్పుగా షేర్ చేశారని, ఏ రైలుకు హాని కలిగించే ఉద్దేశ్యం పిల్లలకు లేదని చెప్పారు. అక్కడ ఉన్న ట్రాక్‌మెన్ అబ్బాయిలను తిట్టి, కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టారని చెప్పినట్లు పేర్కొన్నారు.
“Another train accident averted”?
But the video you’ve shared is a 5 year old (2018) video from Raichur, Karnataka.Also “Sabotaging”? We reached out to circle inspector Ravi Kumar of Raichur Railways, He said that the video was being shared with a false claim but the children…
— Mohammed Zubair (@zoo_bear) June 6, 2023