రాజులు పాలించిన కాలంలో రహస్య గదులు, సొరంగాలు, మార్గాల గురించి విన్నాం. శత్రువు దాడి చేసినప్పడు వారికి చిక్కకుండా.. ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ రహస్య ఏర్పాట్లు ఉపయోగపడేవని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు రాజులు, రాజ్యాలు పోయాయి… ప్రజాస్వామ్య పాలకులు వచ్చారు. అయితే ప్రస్తుత కాలంలో కూడా ఇలాంటి రహస్య గదుల నిర్మాణాలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ దాడులు జరిగినప్పుడు ఇలాంటి వార్తలు వెలుగులోకి వస్తాయి. భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్ గదుల్లోనూ, వాటర్ ట్యాంక్‌ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ, టాయిలెట్లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా.. అయితే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: యాచకురాలి గొప్ప మనసు.. దేవుడికి లక్షరూపాయలు విరాళం
ఈ వెరైటీ సంఘటన కర్ణాటక చిత్రదుర్గలో చోటు చేసుకుంది.ఘీ మధ్యకాలంలో తరచుగా వ్యభిచా ముఠాల గుట్టు రట్టవ్వడం వంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో వెతికినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలోని బాత్రూమ్ను పరిశీలించగా.. ఒకచోట నుంచి గురక శబ్దం వినిపించింది.
ఇది కూడా చదవండి: లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. చెప్పులతో కొట్టిన మహిళా సిబ్బంది!
శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించిన ఓ అధికారికి.. టైల్స్ నుంచి రావడం వినిపించింది. అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే.. అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది. పోలీసులు గదిని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: AP: పరీక్ష హాల్‌కి ఉంగరాలు తెచ్చుకున్న పదో తరగతి విద్యార్థులు.. ఎగ్జామ్ అవగానే పెళ్లి!