ప్రేమించానని వెంటపడటం.. ఆ తర్వాత కొన్ని రోజులు కలిసి తిరిగి.. చివరకు ముఖం చాటేయడం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మరి కొందరు మోసగాళ్లు.. ప్రేమ పేరు చెప్పి అందిన కాడికి దోచుకుని వెళ్తారు. ఇలా ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రేమ పేరు చెప్పి.. తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా.. చాలామంది ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు చాలా మంది మౌనంగా ఉండిపోతారు. మరి కొందరు పోలీసులును ఆశ్రయిస్తారు. ఇక కొందరు మాత్రం ఇదిగో ఇలా మోసం చేసినవాడికి నడి రోడ్డు మీద బుద్ధి చెబుతారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన వాడిని నడిరోడ్డు మీద చితకబాదింది ఓ యువతి. ఆ వివరాలు..
ఝార్ఖండ్ ధన్బాద్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన ఓ యువకుడిని యువతి చితకబాదింది. దుగ్దాకు చెందిన ఓ యువకుడు.. మతం మార్చుకుని అమాయక యువతులను మోసం చేస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ బాధిత యువతి.. యువకుడిని తీవ్రంగా కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మరి దీనిపై మీ అ భిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.