ప్రపంచంలో ఎక్కడా బతకాలన్న కావాల్సిందీ డబ్బు. దీనితో ఏదైనా కొనచ్చు. ఏదైనా చేయచ్చు. ఏ సంబంధమైనా కలవాలన్నా, చెడిపోవాలన్నా డబ్బుకే సాధ్యం. జీవితంలో డబ్బు కీలకం కాబట్టే దాన్ని సంపాదించేందుకు పొద్దున్న లేచి దగ్గరి నుండి ఉరుకులు పరుగులు పెడతాం. సంపాదించిన సొమ్ముతో ఇల్లు, స్థలాలు, పొలాలు, బంగారం కొనడం చేస్తాం. కానీ అదే సొమ్మును రెండింతలు చేసుకోవాలన్న ఆశతో మన దగ్గర ఉన్న సొత్తు అంతా వడ్డీ కింద ఇతరులకు ఇస్తుంటాం. వాళ్లు ఇస్తే సరే, లేదంటే మొత్తానికే మోసం వస్తుంది. ఇక చిట్టీల పేరుతో, వడ్డీల పేరుతో డబ్బులు తీసుకుని ఉడాయించడం వంటి ఘరానా మోసాలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. దానికీ మనమే ఉదాహరణ కాదూ. ప్రముఖులు సైతం మోసపోతున్నారు.
తాను మోసపోయానంటూ రవికాంత్ శుక్లా అనే క్రికెటర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్నోలోని యజ్దాన్ బిల్డర్స్ తనను మోసం చేశారని పేర్కొన్నాడు. తిరిగి డబ్బులు అడుగుతుంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ లక్నో హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. దాలిబాగ్ లో ఆల్యా హెరిటేజ్ అపార్ట్ మెంట్ లోని రెండు ఫ్లాట్లను రవికాంత్ శుక్లా యజ్దాన్ బిల్డర్స్ నుండి రూ.71 లక్షలకు కొనుగోలు చేశారు. లక్నో డెవలప్ మెంట్ అథారిటీ (ఎల్డీఎ) నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ ఆ తర్వాత.. ఆ ఇల్లు ఆక్రమించిన భూమిలో నిర్మించారని చెప్పి ఎల్డీఎ సదరు భవనాన్ని కూల్చేసింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన రవికాంత్ శుక్లా, బిల్డర్స్ కు తన డబ్బును తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరాడు. దీంతో రవికాంత్ తో పాటు అతని కుటుంబానికి బెదిరింపులు రావడం మొదలయ్యాయి.
రాను.. రాను.. ఆ బెదిరింపులు ఎక్కువవడంతో రవికాంత్ శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో ఏడుగురి పేర్లను చేర్చారు. ప్రస్తుతం ఆయన హజ్రత్ గంజ్ లోని ఓ అపార్ట్ మెంట్ ఉంటున్నారు. రాయబరేలీ నివాసి అయిన రవికాంత్ శుక్లా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 2006లో శ్రీలంకలో జరిగిన అండర్ -19 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే ఫైనల్స్ లో భారత్ ఓడిపోయింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పూజారా, పీయూష్ చావ్లా వంటి వారు ఆ టీమ్ లో ఉన్నారు. తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఉత్తర ప్రదేశ్ తరుపున ప్రాతినిధ్యం వహించారు. 2009లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)లో భాగమయ్యాడు. కానీ ఎప్పుడూ ఆడే అవకాశం రాలేదు. ప్రముఖులు కూడా మోసపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
अंतर्राष्ट्रीय क्रिकेटर रविकांत उर्फ रविकांत शुक्ला से याजदान बिल्डर ने ठगे 71 लाख रुपये, रुपए वापस मांगने पर क्रिकेटर को परिवार सहित हत्या कराने की दी धमकी!#cricketer #RavikantShukla #yazdanbuilder #uttarpradesh #lucknowkibaat pic.twitter.com/Wc8OarhXwk
— लखनऊ की बात (@Lucknowkibaat32) February 2, 2023