మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతకుడి ఘోరానికి అమాయకుడు బలవ్వాల్సి వచ్చింది. ఆ దుర్మార్గుడు క్షణికావేశంతో ఊగిపోయి రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..నీమచ్ జిల్లాలోని సింగోలీ పోలీస్ ప్రాంతంలో బండ గ్రామానికి చెందిన వ్యక్తి కన్హయలాల్ భీల్. గత గురువారం సింగోలీ- నీమచ్ ప్రధాన రహదారిపై నిలుచుని ఉన్నాడు.
ఇక అటు నుంచి బైక్ పై ఛితర్ మాల్ గుర్జార్ అనే వ్యక్తి పాలతో నిండి ఉన్న డబ్బాలతో వస్తున్నాడు. దీంతో రోడ్డు పక్కన నిలుచుకున్న భీల్ ను బైక్ తో ఢీ కొట్టడంతో అతను కింద పడి డబ్బాలోని పాలన్ని రోడ్డు పాలయ్యాయి. ఇక ఆగ్రహంతో ఊగిపోయిన పాల వ్యాపారి గుర్జార్ కింద పడ్డ భీల్ వ్యక్తిని పిడుగుద్దులతో గుద్దాడు. దీంతో ఆ వ్యక్తి లబోదిబోమని ఏడుస్తూ ఉన్నాడు. అయినా ఆగ్రహించని పాల వ్యాపారి తన స్నేహితులను పిలిపించుకుని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆగకుండా అతడిపై రాక్షస ప్రయోగాన్ని అమలుపరిచారు.
అతని కాళ్లకు తాళ్లతో కట్టి ట్రక్ వెనకాల కొంత దూరం మేరకు ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రంగా గాయపడిన భీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. తాజాగా జరిగిన ఈ ఘటన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ ఎనిమిది మంది కిరాతకులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా ఈ దారుణ ఘటనపై కొందరు స్పందిస్తూ నిందితుల తీరుపై అగ్రహానికి లోనవుతున్నారు. ఇక ఈ అవమానవీయ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.