ఈ మధ్యకాలంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధ మహిళల వరకు కామాంధులు కళ్లుమూసుకుపోయి అత్యాచారానికి పాల్పడుతున్నారు.
మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. గురువు అంటే దైవంతో సమానం. తల్లిదండ్రుల తర్వాత దైవంలా భావించేది టీచర్నే. పిల్లలకు మంచి బుద్దులు చెప్పి, సభ్యత, సంస్కారం నేర్పించే గురవుని పూజించాలి. మనల్ని సన్మార్గంలో నడిపించి, సత్ప్రవర్తన నేర్పించేది గురువే. పిల్లలు తెలియక తప్పు చేసినా సరిదిద్దేది కూడా ఉపాధ్యాయుడే. మరి అలాంటి పవిత్రమైన టీచర్ అయి ఉండి టీచర్ వృత్తికే కళంకం తెస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. దారి చూపవలసిన టీచర్లే తప్పుదారి నడుస్తున్నారు. కీచకుల్లా పసిపిల్లలను వేధిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కసాయి పనులకు ఒడిగడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో ఓ హెడ్ మాస్టర్ ఆరుగురు విద్యార్థినులపై దారుణానికి ఒడిగట్టిన వాస్తవం వెలుగులోకి వచ్చింది. విషయం బయటపడ్డ తర్వాత కామాంధుడు కటకటాలపాలయ్యాడు. పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఆరుగురు విద్యార్థినులను అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజస్థాన్‌లోని దుంగార్ పూర్లో సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. ప్రభుత్వ పాఠశాలలో ఓ హెడ్ మాస్టర్‌గా ఉన్న రమేశ్ చంద్ర కటారా విద్యార్థినులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు, చిప్స్ ఆశ చూపించి తన కోరిక తీర్చుకునేవాడు. రమేశ్ చంద్ర అస్తమానం బూతు వీడియోలు చూస్తూ ఉండేవాడు. బడిలో 8 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండే విద్యార్థినులను టార్గెట్ చేసి రేప్ చేసేవాడు. స్కూల్‌కి సెలవు ఉన్న రోజుల్లో కూడా ఆడుకోవడానికి విద్యార్థినులను పిలిపించేవాడు. తన ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో అక్కడికి ఒక్కరిని తీసుకెళ్లి రేప్ చేసేవాడని పోలీసులు నిర్ధారించారు. ఒప్పుకోని పిల్లలను బెదిరించేవాడని తెలిపారు. ఆ తర్వాత డబ్బులు పిల్లలకు చాక్లెట్లు, చిప్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవాడని చెప్పారు.
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురైనారు. స్థానికంగా హెడ్ మాస్టర్ నిజ స్వరూపం తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కామాంధునికి కఠిన శిక్ష వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరుగురిని కామదాహంతో రేప్ చేసిన హెడ్ మాస్టర్ని చంపినా పాపం లేదంటున్నారు గ్రామస్తులు. బూతు వీడియోలకు బానిసై కామంతో కళ్లుమూసుకుపోయిన హెడ్ మాస్టర్ చేసిన దుర్మార్గానికి ఊరంతా రగిలిపోతున్నారు. ఈ సంఘనపై మీ కామెంట్స్‌ను తెలియజేయండి.