ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజు రేప్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిర్భయ చట్టం ఉన్నా ఎలాంటి మార్పులు మాత్రం కనిపించటం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు రూపొందించినా బేకాతర్ చేస్తున్నారు. ఇక తాజాగా గోవా రాష్ట్రంలో జులై 24న సౌత్ గోవాలోని కోల్వా బీచ్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది. ఇటీవల ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రేప్ కేసుతో సంబంధమున్న అసిఫ్ హతేలి (21), రాజేశ్ మానే (33), గజానంద్ చించంకర్ (31), నితిన్ యబ్బల్ (19) అనే నిందితులను అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. దీంతో అధికార బీజేపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇక ఇదే విషయంపై తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అసెంబ్లీలో స్పందిస్తూ…10 మంది యువతీ, యువకులు బీచ్‌లో పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. వెళ్లిన ఆ పది మందిలో ఆరుగురు తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ మిగతా ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మాత్రం రాత్రంతా బీచ్‌లోనే గడిపారని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.
ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత వారు బీచ్‌లోనే ఉండాల్సిన అవసరమేంటి? 14 ఏళ్ల అమ్మాయి రాత్రి పూట బీచ్‌కు వెళ్తుంటే తల్లిదండ్రులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలిపారు. వాళ్లు కూడా పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు తల్లిదండ్రులు మాట వినడం లేదని ఆయన అన్నారు. ఇక ఈ బాధ్యతను రక్షణ కల్పించే పోలీసుల మీద వదిలేయడం కరెక్టు వివాదాస్పదంగా మాట్లాడారు. దీంతో సీఎం ప్రమోద్ సావంత్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మహిళా సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక సీఎం స్థాయిలో ఉండి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.