గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా గణపతి ఉత్సవాలు పెద్దగా జరుపుకోలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గముఖం పట్టడంతో ప్రభుత్వాలు గణేష్ ఉత్సవాలకు కొన్ని కండీషన్లు పెడుతూ.. అనుమతి ఇచ్చాయి. గణేషుడు అనగానే మనకు ఎక్కువగా ఖైరతాబాద్ విగ్రహం గుర్తుకు వస్తుంది. ఈ ఏడాది ఖైరతాబాద్ లో 41 అడుగుల పంచముఖ విగ్రహం ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహాన్ని సందర్శిచుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే దేశంలో ఇలాంటి ఫేమస్ వినాయక విగ్రహం మనకు ముంబాయిలో దర్శనం ఇస్తుంది. ఇక్కడ పది రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో ముంబై లాల్ బాగ్చా గణేషుడు, పుణె లోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాలు ఎంతో పురాతనమైనవే కాకుండా చాలా ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ ఆలయాల్లో భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు. గణేషుని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు.
ఏటా హల్వాయి గణపతి మందిరంలో మహా భోగ్ పేరిట భారీ ఎత్తున మోదక్‌లు, మిఠాయిలు ప్రసాదంగా నివేదిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులు హల్వాయి గణపతికి 6 కోట్ల రూపాయల విలువ చేసే 5 కిలోల బంగారు కిరీటాన్ని గణేషుడికి సమర్పించారు. స్వామి వారికి కొత్త దుస్తులు, ఆభరణాలతో అలకరించి.. బంగారు కిరీటం అమర్చారు. దాంతో పాటుగా 21 కేజీల మహాప్రసాదాన్ని సమర్పించారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.