మాజీ సీఎం కూతురు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె లింగమార్పిడి చేసుకోవాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి తాజాగా ఆమె ఓ ప్రకటన కూడా చేసినట్లు తెలుస్తుంది.
పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కూతురు. అవును.. మీరు విన్నది నిజమే. చిన్నప్పటి నుంచి మగ లక్షణాలు ఉండడంతో ఆమె పురుషుడిగా మారాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆమె వైద్య నిపుణులను కూడా సంప్రదించినట్లు కూడా సమాచారం. ఈ విషయంపై ఎవరూ రాద్దాంతం చేయవద్దని, ఇది నా సొంత నిర్ణయమని ఆమె ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె నిర్ణయం పట్ల ఒక్కొరు ఒకలా స్పందిస్తున్నారు. ఇంతకు ఆమె ఏ మాజీ సీఎం కూతురు అనే కదా మీ ప్రశ్న.
బుద్ధా దేవ్ భట్టాచార్య.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 1999-2000 మధ్య కాలంలో సీఎంగా పని చేశారు. సీపీఎం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తూ ఆయన రాజకీయాల్లో సేవలు అందిస్తున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయిత, కాలమిస్టుగా కూడా రాణిస్తున్నారు. ఇక విషయం ఏంటంటే? ఆయన కుమార్తె సుచేతన భట్టాచార్య (41) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి మగ లక్షణాలు ఉండడంతో లింగమార్పిడి చేసుకోవాలని భావిస్తున్నారట. దీనిపై స్పందించిన సుచేతన భట్టాచార్య.. ఇది నా సొంత నిర్ణయమని, ఎవరూ రాద్దాంతం చేయకూడదని కోరింది. ఇందులో భాగంగానే ఆమె లింగమార్పి కోసం అప్పటికే వైద్యులను కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది.