సోషల్ మాద్యమాలు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ.. సెల్ఫీ మోజు ఎక్కువ అయ్యింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అందమైన ప్రదేశాలు, సెలబ్రెటీలు, ఆత్మీయులు ఏదీ మిస్ కాకుండా సెల్ఫీ తీసుకొని జ్ఞాపకంగా దాచుకుంటున్నారు. రెండు రైళ్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా తీసుకున్నా సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు అ ఫోటో వంక చూస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటా అనుకుంటున్నారా? ఆ ఫోటో తీసుకున్నది ఎవరో కాదు తండ్రీ కొడుకు. వివరాల్లోకి వెళితే..
తండ్రీ కుమారులు ఒకే డిపార్ట్ మెంట్ కావడంతో వారు అనుకోని పరిస్థితిలో కలిశారు. ఆ సమయాన్ని మిస్ కాకుండా ఉండేందుకు సెల్ఫీ తీసుకున్నారు. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రైల్వే డిపార్ట్ మెంట్ లో తండ్రి కొంత కాలంగా గార్డు గా పనిచేస్తున్నారు. ఆయన కొడుకు ఇటీవల టీటీగా బాధ్యతలు చేపట్టారు. ఇంట్లో ఎప్పుడూ కలిసే తండ్రీ కొడుకులు ఇలా పక్క పక్కన రైళ్లు వెళ్తున్న సమయంలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఆ సమయంలోనే తీసుకున్న ఫోటో ఎంతో ప్రజాదరణ పొందింది. సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘అద్భుతమైన సెల్ఫీ’ అని దానికి శీర్షిక పెట్టాడు.
ఈ ఫోటో ఎవరిదీ, ఏ సందర్భంలో జరిగింది అన్న విషయం అలాగే ఆ తండ్రీ కొడుకుల పేర్లు కూడా ఆయన ప్రస్తావించలేదు. మొత్తానికి ఈ అద్భుతమైన ఫోటో జూన్ 19న ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తండ్రీ కొడుకుల ప్రేమ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ కి 28,000 కంటే ఎక్కువ లైక్‌లు 1,700కి పైగా రీ-ట్వీట్లు వచ్చాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
अजब ग़ज़ब सेल्फ़ी
पिता रेलवे में गार्ड है और बेटा टीटी है । जब दोनो की ट्रेन अगल-बग़ल से गुजरी तो एक सेल्फ़ी का लम्हा बन गया ❤️ pic.twitter.com/Zd2lGHn7z3
— Suresh Kumar (@Suresh__dhaka29) June 15, 2022