ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో ఒకటిగా నిలుస్తోన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునే భక్తులకు రైల్వే శాఖ తాజాగా ఓ గుడ్ న్యూస్ ను ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో ఒకటిగా నిలుస్తోంది ఏపీలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడున్న శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు తరలి వస్తుంటారు. కలియుగ వైకుంఠంగా పిలవబడుతున్న ఈ ఆలయానికి రోజుకు లక్షల్లో భక్తులు దర్శనానికి వస్తుంటారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చాలా మంది తిరుపతికి రైలు మార్గంలోనే వస్తూ పోతుంటారు. ఇక ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తాజాగా రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ ను ప్రకటించింది. అదేంటంటే?
చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి దేవస్థానం దర్శనానికి భక్తులు రోజుకు రోజుకు పెరిగిపోతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ గతంలో స్పెషల్ ట్రైన్ సర్వీసులను ప్రకటించింది. ఇక ఆ గడువు ముగింపు దశకు రావడంతో రైల్వే శాఖ అదే గడువును మరో కొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ నంబర్-07489 గల స్పెషల్ ట్రైన్.. 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా తిరుపతి నుంచి సికింద్రాబాద్ ట్రైన్ నంబర్- 07490 స్పెషల్ ట్రైన్.. 19, 26 తేదీల్లో అందుబాటులో ఉండనుందని రైల్వే శాఖ తెలిపింది.