దేశంలో కొంత మంది తమకు ఇష్టమైనది దక్కించుకోవడం కోసం కొన్నిసార్లు దేనికైనా సిద్దపడుతుంటారు. ఎంత డబ్బు అయినా లేక్కచేయకుండా వెచ్చిస్తుంటారు. మరికొంత మంది వాహనాలకు మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉండేలా చూస్తుంటారు. ఇక ఖరీదు అయిన బైక్స్, వాహనాలకు ప్రత్యేకంగా ఉండాలని ఫ్యాన్సీ నెంబర్లు వాడుతుంటారు. ఓ వ్యక్తి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓ స్కూటీ కోసం ఫ్యాన్సీ నెంబరును కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరీ దక్కించుకున్నాడు. విచిత్రం ఏంటంటే బండి ఖరీదు కన్నా.. ఫ్యాన్సీ నెంబర్ కే ఎక్కువ డబ్బు ఖర్చయ్యింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల చండీగఢ్‌కు చెందిన బ్రిజ్ మోహన్ రూ. 70 వేలు ఖర్చు చేసి ఓ స్కూటీని కొనుగోలు చేశాడు. ఆర్టీఏ అధికారులు CH-01 CJ 0001 అనే ఫ్యాన్సీ నెంబర్ వేలం వేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూసిన బ్రిజ్ మోహన్.. తానూ వేలంలో పాల్గొన్నాడు. పోటీలో ఆ ఫ్యాన్సీ నెంబర్ ఏకంగా రూ.15.44లక్షలు పలికింది. చివరి వరకు వేలం పాటలో ఉండి ఆ ఫ్యాన్సీ నెంబర్ బ్రిజ్ మోహన్ దక్కించుకున్నాడు. భవిష్యత్ లో తాను కారు కొంటే ఆ నెంబర్ కారుకు ట్రాన్సఫర్ చేయిస్తానని చెప్పాడు.
ఇది చదవండి: బిగ్ బాస్ మిత్రాశర్మపై మహేశ్ విట్టా ప్రశంసలు!
ఇక చండీఘడ్ ఆర్టీఏ అధికారులు మాట్లాడుతూ.. ఏప్రిల్ 14 నుంచి 16 వరకు CH01-CJ సిరీస్ ఫ్యాన్సీ నంబర్‌లకు వేలం నిర్వహించామని తెలిపారు. ఈ వేలంలో మొత్తం రూ.కోటిన్నర ఆదాయం వస్తే అందులో CH-01 CJ 0001 నెంబర్ అత్యధికంగా రూ.15.44 లక్షలకు అమ్ముడయ్యిందన్నారు.