సాధారణంగా చాలా మంది పిల్లలకు డ్యాన్స్, నాట్యంపై బాగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎంతో కష్టపడి నృత్యాలు నేర్చుకుని అనేక ప్రదర్శనలు ఇస్తుంటారు. అయితే కొందరు పిల్లలు చేసే వివిధ రకాల నాట్యాలు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో పిల్లల నృత్యాలకు, డ్యాన్సలకు చూసే ఆడియన్స్ సైతం ఫిదా అవుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో పిల్లలతో పాటు ప్రేక్షకులు కాలు కదుపుతుంటారు. అలా అందరిని ఆశ్చర్య పరిచేలా పిల్లలు తమ ప్రదర్శన చేస్తారు. కొన్ని సార్లు చిన్నారులు చేసే నాట్య ప్రదర్శనలకు మనుషులతో పాటు మూగ జీవాలు సైతం ఫిదా అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారి చేసిన నాట్య ప్రదర్శనకు ఏనుగు ఫిదా అయ్యింది. ఆ చిన్నారితో కలిసి ఆ గజరాజు కూడా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా లోని కటీలు శ్రీదుర్గా పరమేశ్వరి ఆలయంలో ముక్కోటి ఏకదశి సందర్భగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల నృత్యాలను చిన్నారులు ప్రదర్శించారు. అలానే ఓ చిన్నారి గజరాజు ముందు చేసిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తులో గజరాజు ముందు గణపతి దేవుడి పాటుకు ఆ బాలిక నృత్యం చేసింది. అలా ఆ చిన్నారి డ్యాన్స్ చేస్తుండగా గజరాజు కూడా కాలు కదిపాడు. అటు ఇటు కాలు కదుపుతూ ఏనుగూ కూడా డ్యాన్స్ చేసింది. అంతేకాక ఆ చిన్నారిని పలుమార్లు గజరాజు ఆశీర్వదించాడు. అక్కడే ఉన్నవారు ఈ నాట్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అలానే మహీంద్ర గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్ర కూడా తన ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ” ఇది ఆశ్చర్యాన్ని కలిగిందే దృశ్యం. కొత్త ఏడాదిని పురస్కరించుకుని బాలిక సంప్రదాయ నృత్యం చేయడం, దానికి ఆ గజరాజు సంతోషంతో దీవించడం.. అద్భుతంగా ఉంది” అంటూ వీడియోతో పాటు ట్విట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి పోస్టైన కొన్ని గంటల్లోనే లక్షల్లో వీవ్యూస్ వచ్చాయి. బాలిక చేసిన నృత్యంపై పలువురు అభినందనలు తెలిపారు. అంతేకాక ఆ వీడియోను పొగుడ్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలిక నాట్యం చేయడం, ఏనుగు ఆశీర్వదించడం బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరీ.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sri Durgaaparameshwari temple , Kateel, Karnataka.
Amazing. And I would like to think the Temple Elephant is bestowing a blessing on all of us for a Happier New Year! 😊 pic.twitter.com/s2xdqV8w5D— anand mahindra (@anandmahindra) December 31, 2022