ఇటీవల కాలంలో భూకంపాలు వరుసగా సంబవిస్తున్నాయి.. వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 1500మందికిపై తీవ్రంగా గాయపడ్డారు. కర్నాటకలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంబవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
దక్షిణ కన్నడ జిల్లాలో పలు చోట్ల దాదాపు మూడు నుంచి ఏడు సెకన్ల పాటు భూ కంపం సంబవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై 3.5 నమోదు అయ్యింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకి కంపించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు.. ఇండ్ల నుంచి పరుగులు తీశారు.
ప్రకంపణల ధాటికి ఇంట్లో సామాను చెల్లా చెదురైనట్లు స్థానికులు తెలిపారు. గత మూడు రోజులుగా ఇంటి భూ ప్రకంపణలు భయపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ భూకంప పరిస్థితులను కర్నాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ భూకంపాలను నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Karnataka: Earthquake of magnitude 3.0 hits Kodagu; second in four days https://t.co/KKwoAXVkka
— TOI Cities (@TOICitiesNews) June 28, 2022