భక్తులు ఆలయాలకి వెళ్లి దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. తమ కొర్కెలు తీరాలని దేవుడికి మొక్కుకుని నైవేద్యం సమర్పిస్తారు. భక్తులు అరటి పళ్లు, కొబ్బరి కాయలు, లడ్డులు వంటివి దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని చోట్ల అయితే కల్లు, పెరుగు అన్నం కూడా ప్రసాదంగా పెడుతుంటారు. కానీ అందరు ఆశ్చర్యరపోయేలా ఓ దేవాలయంలో మాత్రం మద్యాన్ని నైవేద్యంగా పెడుతున్నారు. ఈ వింత ఆచారం పంజాబ్ లోని ఓ ఆలయంలో ఉంది. ఈ ఆచారాన్ని దాదాపు 90 ఏళ్ల నుంచి పాటిస్తున్నారు. మరి మద్యాన్ని దేవుడి నైవేద్యంగా పెటడం వెనుకాల ఉన్న కథ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం..
పంజాబ్ రాష్ట్రంలోని అమృత సర్ పరిధిలోని భోమా అనే గ్రామంలో బాబా రోడేషా అనే ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది మార్చిలో జరిగే జాతరకు మద్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు. అలా మద్యాన్ని ప్రసాదంగా పెట్టడానికి అక్కడి ప్రజలు ఓ కథ చెబుతున్నారు. ధావన్ గ్రామిక గ్రామానికి చెందిన ఓ బాబా 1896లో తన కుటుంబాన్ని విడిచి భోమా గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడే ఓ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఓ రోజు సమీపంలో గ్రామంలోని ఓ రైతు వచ్చి తనకు సంతానం కలగలేదని ఆయనతో చెప్పుకున్నాడు. అలా బాబాకు చెప్పుకున్న కొన్ని రోజులకే ఆ రైతుకు మగ బిడ్డ పుట్టాడు.
దాంతో ఆ రైతు దంపతులు ఆనందంతో బాబా దగ్గరకు వెళ్లి.. సాధువుకు 500 రూపాయలు కానుకగా ఇస్తారు. కానీ సాధువు డబ్బును తీసుకోకుండా.. ఆ డబ్బులతో మద్యం బాటిల్‌ను కొనుగోలు చేసి తన భక్తులకు ఇవ్వమని కోరుతారు. ఆయన చెప్పినట్టుగానే ఆ దంపతులు మద్యం బాటిల్ కొని అందరికి ఇస్తారు. అప్పటి నుంచి అది ఆచారంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ యోగి మాత్రం ఎప్పుడు మద్యం తాగలేదంటా. అయితే ఆ బాబా 1924 మరణించారు. ఇక అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఒక జాతర జరుగుతుంది.
ఈ జాతర సందర్భంగా భక్తులు అక్కడి దేవాలయాన్ని దర్శించుకుని మద్యాన్ని కానుకగా ఇస్తారు. అదే విధంగా దేవాలయ నిర్వాహకులు కూడా తిరిగి మద్యాన్ని ప్రసాదంగా తిరిగి ఇస్తారు. ఇప్పటికి ఇది జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు వెళ్తున్నారు. మరి.. దేవుడికి మద్యమే నైవేద్యంగా సమర్పించే ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Devotees offered liquor at Baba Rode Shah shrine and distributed it among people as ‘prasad’ during a two-day annual fair that started in Bhoma village in Amritsar district of Punjab on Thursday pic.twitter.com/O7wOBTD2s8
— ANI (@ANI) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.