సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది అంకుల్స్ చేస్తున్న డ్యాన్సులు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ మ్యారేజ్ ఫంక్షన్ లో సంజీవ్ శ్రీ వాస్తవ్ (డబ్బు అంకుల్) కి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ తో ఒక వ్యక్తి డ్యాన్స్ చేయడం అందరినీ రంజింప జేసింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
రోడ్డుపైకి వచ్చిన ఒక అంకులు ఉన్నట్టుండి డ్యాన్స్ చేయడం ఆరంభించాడు.. బాలీవుడ్ లో అమితాబ్ హిట్ సాంగ్ కి జానూ మేరీ జాన్ పాటకు మైమరిచిపోయి స్టెప్పులు వేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా ఆ అంకుల్ తో స్టెప్పులు కలిపాడు. ఇంకేముంది వీరిద్దరి డ్యాన్స్ చూస్తూ అక్కడ ఉన్నవారంతా కేరింతలు కొట్టసాగారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంకుల్ స్టెప్పులు చూసిన నెటిజన్లు ఆయనకు ఫ్యాన్స్ అయిపోతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు రక రకారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా అంకుల్ డ్యాన్స్ చూస్తుంటే మతి పోతుంది.. ఆయనకు సినిమాల్లో ట్రై చేయాల్సింది అని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ऐसे पल #PublicPoliceFriendship के खूबसूरत उदहारण हैं! #DancingCop #DancingWithCop. pic.twitter.com/8Y11Nf5sOO
— Dipanshu Kabra (@ipskabra) April 25, 2022