తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనమామ కమలాకర్ రావు(94) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం కామారెడ్డిలోని దేవీ విహార్ లో సొంతింటిలో కన్నుమూశారు. కమలాకర్ రావు.. స్వగ్రామం రాజంపేట మండలం అర్గొండ. చాలా కాలంగా కామారెడ్డిలోనే నివసిస్తున్నారు. ఆయన సంతానం అంతా హైదరాబాద్‌లో ఉంటారు.
పదేళ్ల క్రితం కమలాకర్‌రావు భార్య చనిపోయారు. ఆ సమయంలో ఉద్యమ నేతగా కేసీర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కామారెడ్డిలో పర్యటించినప్పుడల్లా కేసీఆర్ తన మేనమామ ఇంటికి వెళ్లేవారు. కమలాకర్‌రావు అంత్యక్రియలకు తెరాసా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కరోనా కారణంగా కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.