కొంతమంది యువత ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ.. వీడియోలు తీస్తూ.. నానా హంగామా సృష్టిస్తుంటారు. ఇక మెట్రో రైళ్లలో వీరి రచ్చ తట్టుకోలేము. అయితే ఇప్పటి నుంచి మెట్రో రైళ్లలో, స్టేషన్లలో రీల్స్, వీడియోలు తీస్తే కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరించారు అధికారులు.
ఈ మధ్యకాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా, ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తుంటారు. వీడియోలు తీస్తుంటారు. వారి పక్కన ఎవరున్నారు అని కూడా చూడరు.. ఎక్కడ ఉన్నాం అని కూడా చూడరు. బస్సు, ఆటో, ట్రైన్, విమానాం ఇలా సందర్భాన్ని బట్టి ఏది దొరికితే దాంట్లో రీల్స్, వీడియోలు తీస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో మెట్రో రైళ్లలో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తీసే సంప్రదాయం విపరీతంగా పెరిగిపోయింది. ఇలా రీల్స్ తీయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని అందిన ఫిర్యాదుల కారణంగా.. మెట్రో రైళ్లలో రీల్స్, వీడియోలను తీయ్యడం నిషేధించారు. దీనిని అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు అధికారులు.
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత యువత ఎక్కువగా ఫోన్లలోనే మూతిపెడుతూ ఉంటున్నారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరు వీడియో షేరింగ్ యాప్స్ కు బానిసలుగా మారిపోయారు. ఇక కొంతమంది యువత ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ.. వీడియోలు తీస్తూ.. నానా హంగామా సృష్టిస్తుంటారు. ఇక మెట్రో రైళ్లలో వీరి రచ్చ తట్టుకోలేము. చుట్టూ ఎంత రద్దీ ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా వారంతట వారు రీల్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఇలా రీల్స్ చేసే క్రమంలో ఒక్కోసారి ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతుంటాయి.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లలో, స్టేషన్లలో రీల్స్ చేయడం, వీడియోలు తీయ్యడం లాంటి పనులను నిషేధించింది. ఇలా రీల్స్ చేస్తూ.. ప్రయాణికులను ఇబ్బంది పెట్టోద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో అధికారులు హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో మెట్రోల్లో రీల్స్ చేసే యువత సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. మరి ఢిల్లీ మెట్రో తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
मेट्रो में Travel करें
Trouble नहीं#DelhiMetro pic.twitter.com/heu0osoUSB— Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) March 13, 2023