భారత రాజ్యాంగం 18 ఏళ్ల నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తున్న సంగతి అందరికి తెలుసు. అలానే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు.. దాన్ని వినియోగిచుకోవడం వారి కర్తవ్యం. అలానే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొందరు మాత్రం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అలాంటి వాళ్లు ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. సొంత ఊర్లకు వెళ్లి.. ఓటు వేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. సమయం, డబ్బు.. రెండూ వృథా అవుతాయనే ఆలోచనతో ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో వాళ్ల చేతకూడా ఓటు వేయించి.. ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లు ఊరెళ్లకుండానే తమ ఓటును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధానంగా చర్చకు వచ్చే అంశం ఓటింగ్ శాతం. ఎన్నికల అనంతరం ఓటింగ్ శాతంపైనే ప్రధానంగా అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఓటర్లు వివిధ కారణలతో ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. ఇక 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. అంటే దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఓటింగ్ సరళిని గమనించినట్లయితే బాగా వ్యత్యాస కనిపించింది. సాంకేతికతంగా ఇంతలా అభివృద్ధి చెందిన కూడా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు.. ఎన్నికలు దూరంగా ఉంటడం సరికాదనే భావనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. ముఖ్యంగా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు ఓటు హక్కు వినియోగించుకునేలే చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే రిమోట్ ఎలక్ట్రానికి ఓటింగ్ మెషిన్(RVM) అనే కొత్త పద్ధతిని ఎన్నికల సంఘం తీసుకురానుంది. ఈ ఓటింగ్ మిషిన్ ద్వారా వలస ఓటర్లు.. తాము ఉన్న ప్రాంతం నుంచి ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. సొంత ఊర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒక రిమోట్ పోలింగ్ బూత్ నుంచి ఆర్ వీఎం ద్వారా 72 నియోజకవర్గాల ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించకోవచ్చు. ఈ ఆర్వీఎమ్ విధానాన్ని జనవరి 16న రాజకీయ పార్టీల ఎదుట ప్రదర్శించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఈ కొత్త ప్రయోగ పరిశీలనకు ఎనిమిది జాతీయ పార్టీలను, 57 ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించింది. ఈ ప్రదర్శన అనంతరం జనవరి 31లోపు దీనిపై తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ మేరకు గురువారం 13 పేజీల పత్రాన్ని ఆయా పార్టీలకు పంపింది.
ఈ సరికొత్త ఆర్వీఎమ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వలస వెళ్లిన వారు. ఊరెళ్లి ఓటు వేసే.. కష్టాలు తప్పినట్టే. ఆర్వీఎమ్ వ్యవస్థ అమల్లోకి వస్తే.. ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సరికొత్త విధానంపై ప్రతిపక్షాలు అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంలపైనే విపక్షాలకు అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆర్వీఎమ్ ల ప్రతిపాదన తీసుకురావడం సరికాదంటూ కాంగ్రెస్ వ్యతిరేకించింది. కొత్త ప్రయోగాలు చేసే ముందు పాత సందేహాలను నివృత్తి చేయాలని కాంగ్రెస్ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ.. కేంద్ర ఎన్నిక సంఘం తీసుకురానున్న ఈ ఆర్వీఎమ్ వ్యవస్థపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.