సాధారణంగా కొత్త అల్లుడు వస్తున్నాడు అంటే అత్తమామలు చేసే మర్యాదుల మాములుగా ఉండవు. అల్లుడికి సకల సౌకర్యాలు కల్పించి..సంతోష పరుస్తారు. ఏ చిన్న పోరాపాటు రాకుండ జాగ్రతపడతారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒకోలా కొత్త అల్లుడికి మర్యాదలు చేస్తారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం తమ ఇంటికి వచ్చే కొత్త అల్లుడిని గాడిద మీద ఎక్కించి ఉరేగిస్తారు. మరి ఆ అల్లుడికి కోపం రాలేదా? ఆ వివరాలేంటో చూద్దాం.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. కేజ్ తహసీల్ ప్రాంతంలోని విదా గ్రామంలో 90 ఏళ్ల కిందట ఈ సంప్రదాయం మొదలైంది. ఆ గ్రామానికి చెందిన ఆనంద్‌రావు దేశ్‌ముఖ్ దీన్ని ప్రారంభించారు. అప్పట్లో ఆనంద్‌రావు తన అల్లుడిని గాడిద ఎక్కించి ఊరేగించి ఆపై చివర్లో కొత్తబట్టలు పెట్టారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ ఊరిలో హోలీ రోజు ఈ తంతు జరుగుతోంది. ముందుగా గ్రామంలో కొత్త అల్లుళ్లు ఎవరెన్నారో తెలుసుకుంటారు. తర్వాత వారు ఈ ఆచారం నుంచి తప్పించుకోకుండా నిఘా కూడా ఉంచుతారు.గ్రామంలోని కొత్త అల్లుళ్ల కోసం ప్రత్యేకంగా ఓ సర్వే కూడా చేపడుతారు. ఇందుకు కనీసం మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది. కొత్త అల్లుడు పారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే ప్రత్యేకంగా ఒక గదిలోఅల్లుడిని బంధింస్తారు.
గ్రామస్థులు అందరు కలిసి ఊరేగింపుగా వెళ్లి.. కొత్త అల్లుడిని గాడిద మీద కూర్చోబెడతారు. ఆ తర్వాత.. డప్పులను వాయించుకుంటూ ఊరంతా తిప్పుతారు. గ్రామం మధ్య నుంచి మొదలై.. ఆ ఊరిలోని హనుమాన్ దేవాలయం దగ్గర ముగుస్తుంది. ఊరేగింపు చివర్లో అల్లుడికి నచ్చిన బట్టలు కూడా పెడతారు. ఈ ప్రాంతంలో మాత్రం హోలీ పండుగ అంటే కొత్త అల్లుడు.. గాడిద మీద ఊరేంగిపు. ఇవే వారికి ప్రధానం అలాగే ఏళ్లుగా వస్తున్న ఆచారం.. కచ్చితంగా దీన్ని పాటించి తీరుతారు కూడా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి.. ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.