ఇటీవల పలువురు రాజకీయ, సినీ సెలబ్రెటీలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం చివరకు అది ఫేక్ కాల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కొంత మంది ఆకతాయిలు, మానసికంగా బాధపడేవారు ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఓ అజ్ఞాత వ్యక్తి ఎగ్మూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బుధవారం ఫోన్ చేసి కొద్ది పేపట్లో సీఎం ఇంటిని పేల్చబోతున్నాం.. దమ్ముంటే ఎవరైనా ఆపండి అంటూ ఫోన్ చేసి వెంటనే కట్ చేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయి వెంటనే బాంబ్ స్క్వాడ్ తో ముఖ్యమంత్రి ఇల్లు, కార్యాలయాలకు వెళ్లి తనిఖీలు చేశారు. సీఎం ఇంటి చుట్టు పక్కల బాంబు కోసం జల్లెడ పట్టారు. కానీ ఎక్కడ అలాంటి జాడ కనిపించలేదు.
మొత్తానికి అది ఫేక్ కాలని తెలియడంతో పోలీసులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఆ ఫేక్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందని విషయం పై పోలీసులు దృష్టి పెట్టారు. తిరునల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన తామరైకన్నన్ ఈ ఫోన్ చేసినట్టు నిర్ధారించి, అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Captain Chalapathi Chowdary: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
ఇది కూడా చదవండి: Mahesh Babu: తనను బాగా ఏడిపించిన సినిమా ఏదో చెప్పేసిన మహేష్ బాబు!